AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 53 గంటల బ్యాకప్​.. అదిరిపోయే ఫీచర్లతో Motorola Edge 70 Neo.. లాంచ్ ఎప్పుడంటే

స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు చాలామంది ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఫోన్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. రోజూ పదేపదే ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండా ఎక్కువసేపు పనిచేసే మొబైల్ కోసం చూస్తున్నారు. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Motorola కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొస్తోంది. అదే Motorola Edge 70 Neo. ఇందులో ఏకంగా 7,000mAh భారీ బ్యాటరీని అందిస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 53 గంటల బ్యాకప్​.. అదిరిపోయే ఫీచర్లతో Motorola Edge 70 Neo.. లాంచ్ ఎప్పుడంటే
Motorola Edge 70 Neo
Nikhil
|

Updated on: Nov 23, 2026 | 6:45 AM

Share

పెద్ద బ్యాటరీతో పాటు మెరుగైన డిస్‌ప్లే, కెమెరా, పనితీరును కోరుకునే వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ ఫోన్‌ను రూపొందించారు. 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన AMOLED స్క్రీన్, Snapdragon ప్రాసెసర్, AI ఆధారిత కెమెరా ఫీచర్లు ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. నవంబర్ 24న ఈ ఫోన్ భారత్‌లో విడుదల కానుంది. అయితే దీని ధర ఎంత ఉంటుంది? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

డిస్‌ప్లే, పనితీరు

Motorola Edge 70 Neo నవంబర్ 24న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. విడుదలైన తర్వాత Motorola అధికారిక వెబ్‌సైట్, Flipkart, రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. PANTONE Mountain View, Milky Blue, Gray Lilac, Sage అనే నాలుగు రంగుల్లో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే అంచనాల ప్రకారం రూ.30,000 నుంచి రూ.35,000 మధ్య ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.

ఈ ఫోన్‌లో 6.8 ఇంచుల 1.5K AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 5,200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ఉన్నాయి. స్క్రీన్‌కు Gorilla Glass 7i రక్షణ కల్పించారు. Snapdragon 7s Gen 3 చిప్‌సెట్, 8GB LPDDR5X RAMతో వస్తోంది. AI RAM Boost, వేడిని తగ్గించే Vapor Chamber Cooling System కూడా ఉన్నాయి. Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో విడుదల కానున్న ఈ ఫోన్‌కు మూడు Android అప్‌డేట్లు, ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని Motorola తెలిపింది.

7,000mAh బ్యాటరీ ప్రత్యేకతలు

ఫొటోగ్రఫీ కోసం వెనుకవైపు OIS సపోర్ట్‌తో 50MP Sony LYTIA 710 ప్రధాన కెమెరాను అందించారు. నైట్ విజన్, నాయిస్ రిడక్షన్, AI ఇమేజ్ ఎన్‌హాన్స్‌మెంట్, అడాప్టివ్ స్టెబిలైజేషన్, 10x సూపర్ జూమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. Google Photosలోని Ask, Edit సదుపాయాలతో ఫొటోలను వెతకడం, ఎడిట్ చేయడం సులభం కానుంది. దుస్తులు, అవుట్‌ఫిట్లకు సంబంధించిన AI టూల్స్ కూడా అందిస్తున్నారు.

ఇక ఈ ఫోన్‌లోని 7,000mAh బ్యాటరీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 53 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్, 7.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. Dolby Atmos ఆడియో, IP64 రేటింగ్, MIL-STD-810H సర్టిఫికేషన్ కూడా ఉన్నాయి. ఫోన్ బరువు 204 గ్రాములు, మందం 8.49 మిల్లీమీటర్లు. ఇన్ని ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్‌కు కంపెనీ నిర్ణయించే తుది ధర కీలకం కానుంది. రూ.30 వేల నుంచి రూ.35 వేల ధరల శ్రేణిలో అందుబాటులోకి వస్తే ఈ మోడల్‌కు మంచి పోటీ ఉండే అవకాశం ఉంది.

Follow Us