తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి ప్రపంచవ్యాప్తంగా అపార భక్తులున్నారు. భక్తి శ్రద్ధలతో స్వామివారికి భక్తులు అనేక రకాల కానుకలు సమర్పిస్తుంటారు. నగదు, బంగారం, వెండి, గోవులతో పాటు అరుదైన కానుకలను కూడా సమర్పించడం మనం చూస్తుంటాం. తాజాగా, తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు అత్యంత అరుదైన కానుకను అందజేశారు.
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి ప్రపంచవ్యాప్తంగా అపార భక్తులున్నారు. భక్తి శ్రద్ధలతో స్వామివారికి భక్తులు అనేక రకాల కానుకలు సమర్పిస్తుంటారు. నగదు, బంగారం, వెండి, గోవులతో పాటు అరుదైన కానుకలను కూడా సమర్పించడం మనం చూస్తుంటాం. తాజాగా, తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు అత్యంత అరుదైన కానుకను అందజేశారు. తమిళనాడులోని మదురైకి చెందిన వడివేలు ముగందన్ అనే భక్తుడు టీటీడీ ఎస్‌వీ గోశాలకు మార్వాడి జాతికి చెందిన 9 ఏళ్ల తెల్లటి మగ గుర్రాన్ని విరాళంగా ఇచ్చారు.ఆయన ఈ గుర్రాన్ని సోమవారం ఉదయం గోశాల డైరెక్టర్ డాక్టర్ ఏవీఎన్ శివకుమార్‌కు అధికారికంగా అప్పగించారు. ఈ భక్తుడు గతంలో మధుర మీనాక్షి అమ్మవారి ఆలయానికి కూడా గుర్రాలను దానంగా ఇచ్చారు. అయితే, ఈసారి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఊరేగింపు వాహన సేవల్లో తాను ఇచ్చిన గుర్రం పాల్గొనాలనే బలమైన కోరికతో దీనిని తిరుమలకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ గుర్రానికి అవసరమైన ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తయ్యాక స్వామివారి బ్రహ్మోత్సవాల సేవల్లో దీనిని ఉపయోగించనున్నారు. ఈ కొత్త గుర్రంతో కలిపి ప్రస్తుతం ఎస్‌వీ గోశాలలో మొత్తం ఐదు గుర్రాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ అరుదైన కానుక స్వామివారి సేవల్లో ఒక విశేషంగా నిలవనుంది.
మరిన్ని వీడియోల కోసం :
‘రామాయణ’ కోసం మేకర్స్ కొత్త ప్రమోషనల్ ప్లాన్..
బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడానికి సిద్ధమవుతున్న యశ్
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

