AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి ఇష్టం లేక యువతి గుండు చేయించుకుందా? వైరల్ వీడియో వెనుక అసలు నిజం తెలిస్తే అవాక్కే!

సోషల్ మీడియా ప్రపంచంలో వైరల్ అవ్వడానికి, లైక్‌లు, వ్యూస్‌ పెంచుకోవడం కోసం ప్రజలు ఎంతకైనా తెగిస్తారనడానికి ఒక దిగ్భ్రాంతికరమైన ఉదాహరణ ఇటీవల కనిపించింది. కెమెరా ముందు ఒక యువతి తన తలని గుండు చేయించుకుంటున్న వీడియో ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతోంది. మరింత షాకింగ్‌ విషయం ఏంటంటే.. ఆ వీడియో పైన ఉన్న టెక్స్ట్‌లో, ఆమె తల్లి ఆమెకు పెళ్లి కుదిర్చిందని, దానిని తప్పించుకోవడానికే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుందని పేర్కొనబడింది. ఈ వింత వాదన చేస్తున్న ఈ వీడియో, సోషల్ మీడియాలో ఒక చర్చకు దారితీసింది. అసలేం జరిగిందంటే..

పెళ్లి ఇష్టం లేక యువతి గుండు చేయించుకుందా? వైరల్ వీడియో వెనుక అసలు నిజం తెలిస్తే అవాక్కే!
Keerthana Menon Viral Video
Jyothi Gadda
|

Updated on: Jul 16, 2026 | 3:50 PM

Share

సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం కంటెంట్ క్రియేటర్లు చేసే కొన్ని పోస్టులు ఒక్కోసారి ఇంటర్నెట్‌ను ఎలా షేక్ చేస్తాయో చూపించే సరికొత్త ఉదాహరణ ఇది. ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి కుదిర్చారని ఒక యువతి ఏకంగా తన తల వెంట్రుకలన్నీ తొలగించుకుని గుండు చేయించుకుందనే వార్త, దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వైరల్‌ వీడియో మేరకు.. కీర్తనా మీనన్ అనే యువతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక క్లిప్ ఈ తీవ్ర చర్చకు కారణమైంది.

వైరల్ వీడియోలో కీర్తన ఒక సెలూన్ కుర్చీలో ప్రశాంతంగా కూర్చుని ఉండగా, బార్బర్ ఆమె పొడవైన జుట్టును ట్రిమ్మర్‌తో పూర్తిగా తొలగించడం కనిపిస్తుంది. అయితే ఈ వీడియోకు ఆమె POV: నా పెళ్లిని మా అమ్మ ప్లాన్ చేసింది (POV: My mom planned my marriage) అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో నెటిజన్లు, కమ్యూనిటీ పేజీలు.. సదరు యువతి తనకు ఇష్టం లేని అరేంజ్డ్ మ్యారేజ్‌ను నిరసిస్తూ, పెళ్లిని చెడగొట్టుకోవడానికే ఈ విపరీతమైన నిర్ణయం తీసుకుందని ప్రచారం చేయడం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తూ, ఆధునిక సమస్యలకు వినూత్న పరిష్కారాలు అంటూ ప్రశంసించారు. సొంత జీవిత నిర్ణయాలను తల్లిదండ్రులు శాసించడాన్ని వ్యతిరేకించే ప్రతీకాత్మక చర్యగా దీనిని అభివర్ణించారు. అయితే మరికొందరు మాత్రం, కేవలం సోషల్ మీడియాలో అటెన్షన్ కోసమే ఇలాంటి భ్రమ కలిగించే క్యాప్షన్లు పెడుతున్నారంటూ మండిపడ్డారు.

ఈ వివాదం ముదరడంతో కీర్తనా మీనన్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అసలు నిజాన్ని వెల్లడించింది. వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేసింది. తనకు, తన తల్లికి మధ్య ఎలాంటి పెళ్లి గొడవలు లేవని, గుండు చేయించుకోవడం అనేది పూర్తిగా తన వ్యక్తిగత ఇష్టం అని తెలిపింది. తన కజిన్ ఇంటికి వెళ్లినప్పుడు గుండు చేసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన రావడం, దానికి తన తల్లి కూడా మద్దతు తెలపడంతో.. తామిద్దరూ కలిసి ఒక గుడికి వెళ్లి తలనీలాలు సమర్పించామని ఆమె వివరించింది.

ఇన్‌స్టాగ్రామ్ వీడియోలోని క్యాప్షన్ కేవలం ఒక జోక్ లేదా POV ట్రెండ్‌లో భాగమే అయినప్పటికీ, నెటిజన్లు పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండా కథనాలు అల్లేశారు. వైరల్ వీడియోలు ఎల్లప్పుడూ పూర్తి నిజాన్ని చూపించవు అనడానికి ఈ ఘటనే పెద్ద ఉదాహరణ.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us