AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నటుడికి తప్పని కష్టాలు.. రాత్రంతా మెట్రో స్టేషన్‌లో

Game of Thrones: రష్యా వైమానిక దాడుల ముప్పుతో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. క్షిపణులు, డ్రోన్ల దాడుల హెచ్చరికలు రావడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్నారు. హాలీవుడ్ ప్రముఖ నటుడు, ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫేమ్ నికోలాజ్ కోస్టర్-వాల్డౌ స్థానిక ప్రజలతో కలిసి ఓ రాత్రంతా మెట్రో స్టేషన్‌లో గడిపారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నటుడికి తప్పని కష్టాలు.. రాత్రంతా మెట్రో స్టేషన్‌లో
Actor Nikolaj Coster Waldau Takes Shelter In Ukraine Metro During Air Raid Threat
Sharada V
|

Updated on: Oct 31, 2026 | 9:10 AM

Share

Game of Thrones: రష్యా వైమానిక దాడుల ముప్పుతో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. క్షిపణులు, డ్రోన్ల దాడుల హెచ్చరికలు రావడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్నారు. హాలీవుడ్ ప్రముఖ నటుడు, ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫేమ్ నికోలాజ్ కోస్టర్-వాల్డౌ స్థానిక ప్రజలతో కలిసి ఓ రాత్రంతా మెట్రో స్టేషన్‌లో గడిపారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మెట్రో స్టేషన్‌లోనే రాత్రంతా

‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సిరీస్‌లో జైమ్ లానిస్టర్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 56 ఏళ్ల డానిష్ నటుడు నికోలాజ్ కోస్టర్-వాల్డౌ ప్రస్తుతం ఉక్రెయిన్ పర్యటనలో ఉన్నారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఆయన ఆ దేశాన్ని సందర్శిస్తున్నారు. బుధవారం రాత్రి కీవ్ నగరంపై రష్యా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. దీంతో స్థానిక ప్రజలతో కలిసి నికోలాజ్ మెట్రో స్టేషన్‌లో ఆశ్రయం పొందారు. అక్కడే ఒక చిన్న మంచంపై రాత్రంతా గడిపారు. నీలిరంగు UNDP హుడీ, ఖాకీ ప్యాంటు ధరించి, తనకు అవసరమైన వస్తువులున్న బ్యాగ్‌ను వెంట తెచ్చుకున్నారు. తన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్నారు. కీవ్ మెట్రోలో రాత్రి గడపడం చాలా కష్టంగా అనిపించిందని అన్నారు.

చలికాలం సమీపిస్తోంది.. ఉక్రెయిన్‌కు సాయం అవసరం

నికోలాజ్ కోస్టర్-వాల్డౌ ఉక్రెయిన్ పర్యటన వెనుక ప్రధాన ఉద్దేశం అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న మానవతా సమస్యలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రజలకు అంతర్జాతీయ సమాజం నుంచి మరింత సహాయం అవసరమని అన్నారు. ‘ప్రపంచ దేశాలు ఉక్రెయిన్‌  పరిస్థితిని మర్చిపోకూడదు.  వేలాది ఉక్రెయిన్ ప్రజలకు బాంబు దాడుల సమయంలో మెట్రో స్టేషన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఉక్రెయిన్ ప్రజలు ఎంతో ధైర్యంగా పోరాడుతున్నారు. వారికి అంతర్జాతీయ సమాజం నుంచి సహాయం అవసరం. ముఖ్యంగా చలికాలం సమీపిస్తుండటంతో సహాయం మరింత ముఖ్యం’ అని రాసుకొచ్చారు.

2016 నుంచి UNDP గుడ్‌విల్ అంబాసిడర్‌గా

నికోలాజ్ కోస్టర్-వాల్డౌ 2016 నుంచి ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) గుడ్‌విల్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. వాతావరణ మార్పులపై అవగాహన, లింగ సమానత్వం ఇతర అంశాలపై పనిచేస్తున్నారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది HBO ఫాంటసీ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’. 2011 నుంచి 2019 వరకు ప్రసారమైన ఈ సిరీస్‌లో జైమ్ లానిస్టర్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ పాత్రకు గాను 2018, 2019 సంవత్సరాల్లో రెండుసార్లు ఎమ్మీ అవార్డులకు నామినేట్ అయ్యారు. ఒక రాత్రి మెట్రో స్టేషన్‌లో గడిపిన అనుభవం ద్వారా.. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ప్రజలు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రపంచానికి గుర్తుచేశారు.

Follow Us