AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పింక్‌ బనారసి పట్టు చీరలో అందమైన గులాబీలా నీతా అంబానీ..ఫార్చ్యూన్ ఇండియా వేడుకలో రాయల్ లుక్‌తో…

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ వ్యాపారవేత్త నీతా అంబానీ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ (MPW) 2026 జాబితాలో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా దాదాపు 10 కోట్ల మంది జీవితాల్లో, ముఖ్యంగా 2.9 కోట్ల మంది పిల్లల భవిష్యత్తులో ఆమె తీసుకొచ్చిన సానుకూల మార్పులకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. ముంబైలోని ఫోర్ సీజన్స్ హోటల్‌లో జరిగిన ఈ గ్రాండ్ సెలబ్రేషన్స్‌లో నీతా అంబానీ ఎప్పటిలాగే తనదైన రాయల్ స్టైల్‌తో పాటు భారతీయ సాంప్రదాయ చేనేత కళపై ఉన్న మక్కువను చాటుకున్నారు.

పింక్‌ బనారసి పట్టు చీరలో అందమైన గులాబీలా నీతా అంబానీ..ఫార్చ్యూన్ ఇండియా వేడుకలో రాయల్ లుక్‌తో...
Nita Ambani Pink Saree
Jyothi Gadda
|

Updated on: Jul 14, 2026 | 3:13 PM

Share

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ వ్యాపారవేత్త నీతా అంబానీ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ (MPW) 2026 జాబితాలో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా దాదాపు 10 కోట్ల మంది జీవితాల్లో, ముఖ్యంగా 2.9 కోట్ల మంది పిల్లల భవిష్యత్తులో ఆమె తీసుకొచ్చిన సానుకూల మార్పులకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. ముంబైలోని ఫోర్ సీజన్స్ హోటల్‌లో జరిగిన ఈ గ్రాండ్ సెలబ్రేషన్స్‌లో నీతా అంబానీ ఎప్పటిలాగే తనదైన రాయల్ స్టైల్‌తో పాటు భారతీయ సాంప్రదాయ చేనేత కళపై ఉన్న మక్కువను చాటుకున్నారు.

రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ తన రాజసం ఉట్టిపడే శైలితో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల జరిగిన ఫార్చ్యూన్ మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ కార్యక్రమంలో ఆమె ధరించిన బనారసి చీర అందరి దృష్టిని ఆకర్షించింది. వారణాసిలోని ప్రసిద్ధ గులాబ్ హోలీ స్ఫూర్తితో రూపొందించిన ఈ ప్రత్యేకమైన చీరను తయారు చేయడానికి రెండు నెలల సమయం పట్టింది. సాంప్రదాయ హస్తకళ, అద్భుతమైన డిజైన్‌తో కూడిన ఈ చీర, భారతీయ హస్తకళల సౌందర్యాన్ని పరిపూర్ణంగా చాటిచెబుతుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Hiral Bhatia (@bbhiral)

ఈ ప్రత్యేక సందర్భం కోసం నీతా అంబానీ స్వదేశ్ కలెక్షన్ నుండి ఎంపిక చేసుకున్న అద్భుతమైన తంచోయ్ బనారసి పట్టు చీరను ధరించారు. పవిత్ర కాశీ నగరంలో సుగంధభరితమైన గులాబీ రేకులతో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే గులాబీ హోలీ ఉత్సవాల స్ఫూర్తితో ఈ చీర రంగును లైట్ బ్లష్-పింక్ షేడ్‌లో ఎంపిక చేశారు. వారణాసిలో గులాబీ రేకులు ఆనందానికి, భక్తికి ప్రతీకగా నిలుస్తాయి.

ఈ లగ్జరీ చీరను మాస్టర్ కళాకారులు ఆరుషి లోహియా, కృష్ణ లోహియా కలిసి సుమారు రెండు నెలల పాటు రాత్రింబగళ్లు శ్రమించి మగ్గంపై అల్లారు. ఎంతో క్లిష్టమైన, నిశితమైన నేత శైలికి పేరొందిన తంచోయ్ టెక్నిక్‌ను ఇందులో ఉపయోగించారు. చీర పొడవునా ఐవరీ, యాంటిక్ గోల్డ్ జరితో నైపుణ్యంగా చెక్కిన పూల జాల్, బుటాలు చీరకు ఒక ప్రత్యేకమైన కాంతిని, రాయల్ ఫినిషింగ్‌ను అందించాయి.

భారతదేశపు అపురూపమైన వస్త్ర సంస్కృతిని, శతాబ్దాల నాటి సాంప్రదాయాలను కాపాడుతున్న నేతన్నల ప్రతిభను దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళల వేదికపై ప్రదర్శించడం ద్వారా నీతా అంబానీ భారతీయ హస్తకళలకు అగ్రతాంబూలం ఇచ్చారు. వ్యాపార, ఆర్థిక, సాంకేతిక రంగాలకు చెందిన ఎందరో ప్రతిభావంతులైన మహిళా నేతలు హాజరైన ఈ వేడుకలో, నీతా అంబానీ ధరించిన ఈ గులాబీ హోలీ బనారసి పట్టు చీర ఫ్యాషన్ ప్రపంచంలోనే కాక, చేనేతను ప్రేమించే ప్రతి ఒక్కరి హృదయాలను అమితంగా ఆకట్టుకుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ

కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..

చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!

ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పలు ఎలా వస్తాయి?

శ్రీలంకపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే

తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

తాటి బెల్లంలో అసలైనది ఏది? నకిలీది ఏది? గుర్తించడం ఎలా..?

బుమ్రా ఆస్తి విలువ తెలిస్తే ఫ్యూజులు అవుట్ కావాల్సిందే

కన్న తల్లిని, కడుపున పుట్టిన కూతురిని.. ఒకే రోజు హతమార్చిన కసాయి

ఎప్పటికైనా ఆ తెలుగు స్టార్ హీరో సినిమాలో నటించాలన్నది నా కోరిక

క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌

అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?

‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో

కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా

అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ

అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!

ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..

ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!

ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్

మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!