AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైంటిస్టుల అద్భుత సృష్టి.. చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!

చైనాకు చెందిన ఒక న్యూరోటెక్నాలజీ సంస్థ తయారుచేసిన బయోనిక్ చేయి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. షాంఘై వేదికగా జులై 17న జరిగిన వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ (WAIC)లో బ్రెయిన్‌కో (BrainCo) కంపెనీ దీన్ని ఆవిష్కరించింది. శరీరానికి అతుక్కొని లేకపోయినా.. కేవలం మనిషి మెదడు ఆలోచనలతో వైర్‌లెస్ విధానంలో ఈ రోబోటిక్ చేయి పనిచేయడం దీని ప్రత్యేకత..

సైంటిస్టుల అద్భుత సృష్టి.. చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!
China Bionic Hand
Rakesh
| Edited By: |

Updated on: Aug 04, 2026 | 7:19 PM

Share

సాధారణంగా కృత్రిమ అవయవాలు శరీరానికి అమర్చితేనే పనిచేస్తాయి. కానీ చైనా తయారు చేసిన బ్రెయిన్‌కో బయోనిక్ చేయి వినియోగదారుడి చేతికి లేకపోయినా సొంతంగా కదులుతుంది. కండరాలు, నాడుల నుంచి వచ్చే విద్యుత్ సంకేతాలను ఇది గుర్తిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ఆ సంకేతాలను రియల్ టైమ్‌లో వేగంగా విశ్లేషిస్తుంది.

ఆ తర్వాత వైర్‌లెస్ ద్వారా కదలికలకు సంబంధించిన కమాండ్స్ ఆ రోబోటిక్ చేతికి అందుతాయి. దీంతో అందులోని ఒక్కో వేలు అత్యంత కచ్చితత్వంతో కదులుతుంది. వాస్తవానికి ఈ బయోనిక్ చేతికి 21 డిగ్రీల స్వేచ్ఛ (degrees of freedom) ఉన్నట్టు బ్రెయిన్‌కో సంస్థ చెబుతోంది. అంతేకాకుండా అరచేతికి పూర్తి స్పర్శజ్ఞానం ఉండటం దీని మరో ప్రత్యేకత. దీనికి వాడిన సిలికాన్ కవచం అచ్చం నిజమైన మనిషి చర్మంలానే కనిపిస్తుంది. పైగా ఈ బయోనిక్ చేయి బరువు చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇది ఒక పెద్ద యాపిల్ పండు బరువుతో సమానం. చేతులు కోల్పోయిన దివ్యాంగులకు ఈ సరికొత్త బయోనిక్ చేయి నిజంగా ఒక వరం లాంటిది. వారు తమ రోజువారీ పనులను సులభంగా చేసుకునేందుకు ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏ వస్తువునైనా సులువుగా పట్టుకోవడం, దానికి సంబంధించిన స్పర్శను గ్రహించడం దీని ద్వారా సాధ్యమవుతుంది.

ఇవి కూడా చదవండి

ఒక చిన్న ఈఈజీ (EEG) హెడ్‌సెట్ ద్వారా మనిషి మెదడులోని సంకేతాలను ఈ పరికరం గ్రహిస్తుంది. నీళ్ల గ్లాసు పట్టుకోవాలన్నా, లేదా ఏదైనా వస్తువును తీయాలన్నా.. వినియోగదారుడి ఆలోచనను క్షణాల్లోనే కమాండ్స్‌గా మార్చి ఈ రోబోటిక్ చేయి పనిచేస్తుంది. బ్రెయిన్‌కో సంస్థ ఇప్పటికే దివ్యాంగుల కోసం బయోనిక్ చేతులను మార్కెట్లో విక్రయిస్తోంది. అయితే డబ్ల్యూఏఐసీ (WAIC)లో ప్రదర్శించిన ఈ సరికొత్త వైర్‌లెస్ డెమో మోడల్ ధరను కానీ, మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందనే విషయాన్ని కానీ కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఈ బయోనిక్ చేయి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Follow Us
మనం మరిచిపోయిన ప్రాచీన పద్ధతిలో చల్ది అన్నం.. ఇలా చేస్తే అమృతం
మనం మరిచిపోయిన ప్రాచీన పద్ధతిలో చల్ది అన్నం.. ఇలా చేస్తే అమృతం
తొలి మ్యాచ్‌కు ముందే టీమిండియాకు బిగ్ షాక్.. ఛోటా ప్యాకెట్ ఔట్
తొలి మ్యాచ్‌కు ముందే టీమిండియాకు బిగ్ షాక్.. ఛోటా ప్యాకెట్ ఔట్
ఇలాంటి సినిమాకు అలాంటి హీరోనా అన్నారు..
ఇలాంటి సినిమాకు అలాంటి హీరోనా అన్నారు..
ప్రపంచ వ్యవస్థకు కొత్త రోడ్‌మ్యాప్ నిర్ధేశించిన ప్రధాని!
ప్రపంచ వ్యవస్థకు కొత్త రోడ్‌మ్యాప్ నిర్ధేశించిన ప్రధాని!
స్మార్ట్‌వాచ్ వెనుక ఈ గ్రీన్ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా?
స్మార్ట్‌వాచ్ వెనుక ఈ గ్రీన్ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా?
ఆన్‌లైన్‌లో గణపతి విగ్రహం కొంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
ఆన్‌లైన్‌లో గణపతి విగ్రహం కొంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
జైలు నుంచి తప్పించుకోవాలనుకున్న ఖైదీ ప్లాన్.. చివరికీ!
జైలు నుంచి తప్పించుకోవాలనుకున్న ఖైదీ ప్లాన్.. చివరికీ!
దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. ప్రియుడి కోసం..
దేవుడా.. ఇలాంటి కూతురు ఎవ్వరికీ పుట్టొద్దు.. ప్రియుడి కోసం..
వీరికి వినాయకుడికి అనుగ్రహం ఖాయం! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
వీరికి వినాయకుడికి అనుగ్రహం ఖాయం! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
కూరలు లేనప్పుడు అన్నంలోకి, టిఫిన్లలోకి బెస్ట్ పల్లీ కారం పొడి
కూరలు లేనప్పుడు అన్నంలోకి, టిఫిన్లలోకి బెస్ట్ పల్లీ కారం పొడి