AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Laya: ఎప్పటికైనా ఆ తెలుగు స్టార్ హీరో సినిమాలో నటించాలన్నది నా కోరిక.. మనసులో మాట బయటపెట్టిన లయ

సీనియర్ హీరోయిన్ లయ మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యింది. ఇప్పుడామె వరుసగా సినిమాలు చేస్తోంది. అయితే ఎన్నో ఆశలతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన లయకు ఒక సాలిడ్ సక్సెస్ అవసరం. రీఎంట్రీలో ఆమె చేసిన సినిమాలన్నీ కమర్షియల్ గా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.

Actress Laya: ఎప్పటికైనా ఆ తెలుగు స్టార్ హీరో సినిమాలో నటించాలన్నది నా కోరిక.. మనసులో మాట బయటపెట్టిన లయ
Actress Laya
Basha Shek
|

Updated on: Aug 04, 2026 | 6:53 PM

Share

సీనియర్ హీరోయిన్ లయ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సావిత్రి, సౌందర్య తర్వాత తెలుగులో హోమ్లీ హీరోయిన్ గా లయ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది లయ. తనదైన అందం, సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుందీ అందాల తార. అయితే పెళ్లి తర్వాత క్రమంగా సినిమాలకు దూరమైంది లయ. భర్తతో కలిసి విదేశాల్లో సెటిలైపోయింది. అయితే ఇప్పుడు పిల్లలు పెరిగి పెద్ద వారవ్వడంతో మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిందీ ముద్దుగుమ్మ. గతేడాది నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది లయ. ఇక ఈ ఏడాది శివాజీతో కలిసి సాంప్రదాయనీ సుప్పిని శుద్ధపూసని అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది. రీసెంట్ గా జగపతిబాబుతో కలిసి వదలా, అలాగే శ్రీకాంత్ తో కలిసి మిస్టర్ మిడిల్ క్లాస్ అనే సినిమాల్లో లీడ్ హీరోయిన్ గా చేసింది. అయితే సెకెండ్ ఇన్నింగ్స్ లో లయకు కలిసి రావడం లేదు. ఇప్పటివరకు ఆమె చేసిన నాలుగు సినిమాలన్నీ కమర్షియల్ గా విజయం సాధించలేకపోయాయి. దీంతో రీఎంట్రీలో సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తోందీ అందాల తార.

ఇదిలా ఉంటే తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది లయ. బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ఆమెకు మాత్రం మెగాస్టార్ చిరంజీవి సినిమాలో చేయాలన్న కల కలగానే మిగిలిపోయిందట. ఇదే విషయంపై ఇక ఇంటర్వ్యూలో మాట్లాడిన లయ.. ‘ఒక్కొక్కరు ఒక్కో స్టేజ్‌ నుంచి వస్తారు. హీరోయిన్‌గా రాణిస్తారు. స్టార్‌గా ఎదుగుతారు. సక్సెస్‌ని బట్టి వారి రేంజ్‌ పెరుగుతూ ఉంటుంది. నేను కూడా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాను. ఒక స్టేజ్‌కి వచ్చాక మరో స్టేజ్‌కి వెళ్లాలనుకుంటాం. నా సినిమా కెరీర్ లో చాలా మంది హీరోలతో నటించాను. కానీ మెగాస్టార్ చిరంజీవితో కలిసి వర్క్ చేసే అవకాశం రాలేదు. ఆయనతో సినిమా చేయాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పటివరకు ఆ కోరిక తీరలేదు. చిరంజీవితో సినిమా చేయలేకపోయాననే వెలితి అలానే ఉండిపోయింది. ఆ అసంతృప్తి ఇప్పటికీ ఫీలవుతుంటాను. కనీసం సెకెండ్ ఇన్నింగ్స్ లోనైనా ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే బాగుండు’ అని చెప్పుకొచ్చారు లయ. ప్రస్తుతం ఈ సీనియర్ నటి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి మెగాస్టార్ తో నటించే ఛాన్స్ లయకు ఎప్పుడు వస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!