Bigg Boss Telugu 10: గత సీజన్ మిస్ అయ్యంది.. ఈసారి మాత్రం పక్కా! బిగ్‌బాస్ 10లోకి టాలీవుడ్ హాట్ యాంకర్
తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా వెలుగొందుతోన్న ఈ ముద్దుగుమ్మ గత సీజన్ లోనే బిగ్ బాస్ లోకి వస్తుందని ప్రచారం జరిగింది. అయితే అదేమీ జరగలేదు. అయితే పదో సీజన్ లో మాత్రం ఈ అందాల యాంకరమ్మ రాక దాదాపు ఫిక్స్ అయ్యిందని సమాచారం.

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఈసారి తెలుగుతో పాటు హిందీ, కన్నడం, తమిళం, మలయాళం తదితర భాషల్లో ఒకేసారి బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ ఉండనుంద. ఇక తెలుగులో పదో సీజన్ కావడంతో ఈసారి ఈ రియాలిటీ షోపై భారీ అంచనాలు ఉన్నాయి. కంటెస్టెంట్ల ఎంపిక మొదలు గేమ్స్, టాస్కుల నిర్వహణలో ఈసారి సరికొత్త పద్దతులు, రూల్స్ ను అవలంభించనున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్ లో కంటెండర్స్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో అయితే చాలా మంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. పల్లవి గౌడ, తేజస్విని గౌడ, కావ్యశ్రీ, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్ జబర్దస్త్ ఫేమ్ ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ భార్య జ్యోతి, నందూస్ వరల్డ్ నందూ, రాయల్ మెక్ రమణ, శివ్, కడలి సత్యనారాయణ ఇలా చాలా మంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో ఓ అందాల యాంకరమ్మ పేరు కూడా చేరింది. ఆమె మరెవరో కాదు వర్షిణీ సౌందర రాజన్.
మొన్నటివరకు సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోలతో బిజీ బిజీగా గడిపింది వర్షిణి. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పెద్దగా టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లేవని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వర్షిణీ బిగ్ బాస్ 10లోకి వెళ్లనుందని గట్టిగా ప్రచారం జరుగుతోంది. సెలబ్రిటీ కేటగిరీ కంటెస్టెంట్ల లిస్టులో వర్షిణి పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు వర్షిణీని సంప్రదించారని, అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 నుంచి దాదాపు ప్రతి సీజన్‌లోనూ వర్షిణి పేరు చర్చకు వచ్చింది. అయితే వివిధ కారణాలతో ఆమె బిగ్‌బాస్ హౌస్‌లోకి రాలేదు. అయితే ఇప్పుడు మాత్రం వర్షిణీ కచ్చితంగా హౌస్ లోకి అడుగు పెట్టనుందని తెలుస్తోంది. కాగా వర్షిణీ యాంకర్ గానే కాకుండా నటిగానూ సత్తా చాటింది. పలు సినిమాలు, వెబ్ సిరీసుల్లోనూ నటించింది. గ్లామర్ పరంగానూ ఈముద్దుగుమ్మకు నెట్టింట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
వర్షిణీ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




