AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic Movie: రికార్డుల వేట షురూ చేసిన యశ్.. రిలీజ్‌కు ముందే ‘ధురంధర్ 2’ను వెనక్కు నెట్టిన టాక్సిక్

కన్నడ సూపర్ స్టార్ యశ్ నటించిన 'టాక్సిక్' సినిమా రిలీజ్ కు మూడు రోజులే మిగిలి ఉన్నాయి.అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆగస్టు 26 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Toxic Movie: రికార్డుల వేట షురూ చేసిన యశ్.. రిలీజ్‌కు ముందే 'ధురంధర్ 2'ను వెనక్కు నెట్టిన టాక్సిక్
Toxic Movie
Basha Shek
|

Updated on: Aug 23, 2026 | 4:36 PM

Share

రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ( టాక్సిక్ ) చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్‌ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తోంది. సినిమా విడుదలకు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ‘టాక్సిక్’ అడ్వాన్స్ బుకింగ్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే అ చిత్రం ‘ధురందర్ 2’, ‘యానిమల్’, ‘జవాన్’ వంటి చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది. ‘టాక్సిక్’ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లు ఆగస్టు 21న ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యాయి. బుకింగ్‌లు ప్రారంభమైన కేవలం 48 గంటల్లోనే, ఈ చిత్రం రూ. 18 కోట్లకు పైగా భారీ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో 4.7 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఇందులో, ఒక్క కన్నడ ఒరిజినల్ వెర్షన్ మాత్రమే రూ. 10 కోట్ల కు పైగా బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం (ఆగస్టు 22) ఉదయం బుక్‌మైషోలో ప్రతి గంటకు 10,000 టిక్కెట్లు అమ్ముడవడంతో ఈ సినిమా క్రేజ్ స్పష్టంగా కనిపించింది. హిందీ డబ్బింగ్ వెర్షన్ బాక్సాఫీస్ విశ్లేషకుల అంచనాలను కూడా తలకిందులు చేసింది. ఉత్తర భారతదేశంలోనే మొదటి రోజు షో కోసం భారీగా టికెట్లు అమ్ముడయ్యాయి. వీటి ద్వారా దాదాపు రూ.8 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని సమాచారం. ఇక మొదటి 24 గంటల్లోనే భారతదేశవ్యాప్తంగా సుమారు 2.5 లక్షల టాక్సిక్ సినిమా టికెట్లు సేల్ అయ్యాయి. తద్వారా షారుఖ్ ఖాన్ ‘జవాన్’ (1.5 లక్షలు), రణవీర్ సింగ్ ‘ధురందర్ 2’ (1.3 లక్షలు), రణబీర్ కపూర్ ‘యానిమల్’ (55 వేలు) వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ రికార్డులను టాక్సిక్ మూవీ అధిగమించింది. మొత్తానికి రిలీజ్ కు ముందే టాక్సిక్ సినిమా రికార్డుల వేట షురూ చేసిందని చెప్పవచ్చు.

ఇక కేజీఎఫ్ చాప్టర్ 2′ తర్వాత యశ్ నటిస్తోన్న టాక్సిక్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. యశ్ సరసన నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి స్టార్స్ నటించారు. అలాగే అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ సహా పలువురు విదేశీ నటీనటులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, యష్ మాన్‌స్టర్ మైండ్స్ సంస్థలు సంయుక్తంగా టాక్సిక్ చిత్రాన్ని నిర్మించాయి. రవి బస్రూర్, తనిష్క్ బాగ్చి, ఫహీమ్ అబ్దుల్లా ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. కొన్ని పాటలకు విశాల్ కూడా సంగీతం అందించారు. భారీగా హింసాత్మక, బోల్డ్ సన్నివేశాలున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

టాక్సిక్ సినిమాలో యశ్, కియారా అద్వానీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us