Panjaa Re-Release: పవన్ కల్యాణ్ ‘పంజా’ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి? ఫొటోస్ చూసి స్టన్ అవుతోన్న నెటిజన్లు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన పంజా సినిమా మళ్లీ థియేటర్లలో సందడి కానుంది. పవన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 02న ఈ మూవీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది. మరి ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించిన సారా జేన్ డయాస్ ఇప్పుడెలా ఉందో చూద్దాం రండి.

ఓజీ కంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్టైలిష్ గ్యాంగ్ స్టర్ గా నటించిన చిత్రం పంజా. 2011లో రిలీజ్ అయిన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ కాల క్రమేణా కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ముఖ్యంగా పవన్ అభిమానులు అయితే ఈ సినిమాను రిపీట్ మోడ్ లో చూస్తారు. ఇప్పటికీ టీవీల్లో వస్తే ఈ సినిమాను చాలా మంది ఛానెల మార్చుకుండా చూస్తుంటారు. కాగా పవన్ కల్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 02) ను పురస్కరించుకుని పంజా సినిమా మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. కోలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ తెరకెక్కించిన ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించారు. ఒకరు ట్రెండీ లుక్ లో కనిపించిన అంజలి లవానియా కాగా మరొకరు ట్రెడిషినల్ లుక్ లో ఆకట్టుకున్న సారా జేన్ డయస్. అయితే అంజలి పాత్ర ఫస్టాఫ్ లోనే ముగుస్తుంది. కానీ సారా రోల్ సినిమా మొత్తం ఉంటుంది. పవన్ కల్యాణ్- సారా కాంబినేషన్ లో వచ్చే సీన్స్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. ఇందులో ఆమె క్యూట్ లుక్స్, యాక్టింగ్ ఆడియెన్స్ ను మెప్పించాయి. అయితే అప్పట్లో పంజా సినిమ ఫ్లాప్ కావడంతో ఈ మూవీ తర్వాత సారాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ్, హిందీ సినిమాల్లో నటించిందీ అందాల తార.
ఒమన్ దేశానికి చెందిన సార్ జేన్ డయాస్ మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. పంజా కంటే ముందు మంచు విష్ణు గేమ్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ సినిమాల్లోనూ యాక్ట్ చేసిందీ అందాల తార. ఆ మధ్యన ఒక హాలీవుడ్ సినిమాలోనూ సారా యాక్ట్ చేసింది. అయితే స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయిందీ ముద్దుగుమ్మ. మధ్యన వైస్రాయ్ హౌస్, ది బకింగ్ హమ్ మర్డర్స్ వంటి ఇంగ్లిష్ సినిమాల్లోనూ ప్రధాన పాత్రలు పోషించింది సారా.. అలాగే హిందీలో తాండవ్, మేడ్ ఇన్ హెవెన్, ది ఫ్రీలాన్సర్, కంఖజురా వంటి సూపర్ హిట్ వెబ్ సిరీసుల్లో నటించింది
సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది సారా. నిత్యం తన గ్లామరస్ అండ్ బ్యూటిఫుల్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. కాగా ఈ అమ్మడి వయసు సుమారు 43 సంవత్సరాలు అయినా ఈ బ్యూటీ ఇంకా సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తోంది. మరి సారా లేటెస్ట్ ఫొటోస్ పై ఓ లుక్కేయండి.

Sarah Jane Dias
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




