AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonali Bendre: సోనాలి బింద్రే కుమారుడిని చూశారా? వీడియో వైరల్.. హృతిక్ రోషన్‌లా ఉన్నాడంటోన్న నెటిజన్స్

తెలుగు, తమిళం , హిందీ భాషల్లో కలిపి వందలాది సినిమాలు చేసింది సోనాలి బింద్రే. స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తెలుగులో అయితే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాలు చేసిందీ అందాల తార.

Sonali Bendre: సోనాలి బింద్రే కుమారుడిని చూశారా? వీడియో వైరల్.. హృతిక్ రోషన్‌లా ఉన్నాడంటోన్న నెటిజన్స్
Sonali Bendre
Basha Shek
|

Updated on: Aug 22, 2026 | 11:20 AM

Share

1990-2000వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది సోనాలి బింద్రే. తన అందం, అభినయంతో తిరుగులేని నటిగా గుర్తింపు తెచ్చుకుంది. హిందీ సినిమాలతో తెరంగేట్రం చేసిన ఈ అందాల తార ఆ తర్వాత తెలుగులోనూ వరుసగా సినిమాలు చేసింది. మహేష్ బాబు నటించిన మురారి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది సోనాలి. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. మురారి తర్వాత ఇంద్ర, ఖడ్గం, మన్మథుడు, పల్నాటి బ్రహ్మనాయుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది సోనాలి. అంతకు ముందు బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ , సల్మాన్ ఖాన్ , హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేసిందీ అందాల తార. సినిమాల సంగతి పక్కన పెడతే.. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లిపీటలెక్కింది సోనాలి. గోల్డీ బెహిల్ అనే బాలీవుడ్ డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో చాలా ఏళ్ల పాటు సినిమాలకు దూరమైందీ అందాల తార. ఇక 2013 వ సంవత్సరం లో ‘ఒన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబై’ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిందీ ముద్దుగుమ్మ. సెకెండ్ ఇన్నింగ్స్ లో కొన్ని సినిమాలు కూడా చేసింది. అయితే అప్పుడే సోనాలి జీవితంలో ఓ కుదుపు. బ్రెయిన్ క్యాన్సర్ ఆమెను బాగా ఇబ్బంది పెట్టింది. అయితే సడలని ఆత్మవిశ్వాసం, సంకల్పంతో ఈ మహమ్మారిని విజయవంతంగా జయించిందీ అందల తార.

ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీసుల్లో సహాయక నటిగా బిజీగా ఉంటోంది సోనాలి బింద్రే. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన రాఖ్ వెబ్ సిరీస్ ఓటీటీలో ది బెస్ట్ సిరీసుల్లో ఒకటిగా నిలిచింది. కాగా సోనాలికి రణవీర్ అనే కుమారుడు ఉన్నారు. సినిమా ఈవెంట్స్, ఇతర కార్యక్రమాల్లోనూ తరచూ తన కుమారుడితో కలిసి హాజరవుతుంటుందీ అందల తార. ఈ నేపథ్యంలో రణవీర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. మంచి హైట్, శరీర సౌష్టవం ఉన్న రణ్ వీర్ ను చూస్తుంటే షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ లా ఉన్నాంటూ నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సినిమాల్లోకి వస్తే కచ్చితంగా మంచి హీరో అవుతాడని సినీ అభిమానులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి నెట్టింట వైరలవుతోన్న సోనాలి బింద్రే కుమారుడి ఫొటోలు, వీడియోలపై ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

భర్త, కుమారుడితో సోనాలి బింద్రే..

View this post on Instagram

A post shared by E24 Bollywood (@e24official)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us