Jabardasth: నేను, సీఎం రేవంత్ రెడ్డి క్లాస్‌మేట్స్.. ఒకే బెంచ్ కూడా.. ఆసక్తికర విషయం చెప్పిన జబర్దస్త్ కమెడియన్
ఈ కమెడియన్ తెలుగులో 150 కు పైగా సినిమాలు చేశాడు. తనదైన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఇక జబర్దస్త్ లోనూ అడుగు పెట్టి టీమ్ లీడర్ దాకా ఎదిగాడు. అయితే ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయని ఈ నటుడు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకు హాజరయ్యాడు.

చాలా మంది సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఒకప్పుడు కలిసి చదువుకున్నవాళ్లే. మరీ ముఖ్యంగా సినీ, రాజకీయ సెలబ్రిటీల్లో చాలా మంది కలిసి చదువుకున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్- అక్కినేని సుమంత్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి- బాలకృష్ణ.. ఇలా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కలిసి చదువుకున్నారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ ఒకరు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన క్లాస్ మేట్ అంటూ ఆసక్తికర విషయం బయట పెట్టాడు. రేవంత్ రెడ్డికి చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉండేదని, అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారని పేర్కొన్నారు. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరనుకుంటున్నారా? ఈ నటుడు తెలుగులో సుమారు 150 కు పైగా సినిమాల్లో నటించారు. తనదైన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. బుల్లితెరపై కూడా సత్తా చాటారీ కమెడియన్. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోలో టీమ్ లీడర్ రేంజ్ కు ఎదిగారు. అయితే ప్రస్తుతం అడపాదడపా మాత్రమే సినిమాల్లో కనిపిస్తున్నాడీ సీనియర్ యాక్టర్. అయితే అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో కనిపిస్తుంటారు. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అంటే ఈ నటుడికి తెగ అభిమానం. ఆయన కోసం ప్రాణమైనా ఇస్తానంటూ గతంలో అతను చేసిన కామెంట్స్ నెట్టింట వైరలయ్యాయి. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. అతను మరెవరో కాదు కారుమంచి రఘు
జబర్దస్త్ లో రోలర్ రఘుగా ఆడియెన్స్ ను నవ్వించిన రఘు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అక్కడ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు .ఇదే క్రమంలో రాజకీయాల గురించి స్పందిస్తూ రఘు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను, సీఎం రేవంత్ రెడ్డి, జెట్టి కుసుమ కుమార్ ముగ్గురం కాలేజ్ మేట్స్. ఒకే క్లాస్, ఒకే బెంచ్ కూడా మేము. 1989- 90 ఆ సమయంలో దోమలగూడ AV కాలేజీలో కలిసి చదువుకున్నాం. కుసుమ కుమార్ నాకు బావ అవుతాడు. అప్పుడే వాళ్లిద్దరూ పొలిటికల్ గా తిరిగేవాళ్లు. నాకు మాత్రం రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదు. అందుకే వాళ్లతో పొలిటికల్ గా తిరగలేదు. ఇక నాకు మొదటి నుంచి టీడీపీ పార్టీ అంటే అభిమానం. సమయం, అవసరం వచ్చినప్పుడు పార్టీ కోసం ప్రచారం చేయడానికి రెడీగా ఉన్నాను’ అని రఘు చెప్పుకొచ్చారు.
భార్యతో కమెడియన్ రఘు
View this post on Instagram
ఇక ఇదే ఇంటర్వ్యూలో మరోసారి ఎన్టీఆర్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు రఘు. ‘ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుకోవడంలో తప్పులేదు. కానీ దానికంటూ ఓ టైమ్ రావాలి. ఎన్టీఆర్ మనసులో ఏముందో తెలుసుకోవాలి. ఆయన సీఎం అయితే చూడాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాలో నేను కూడా నటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆడిషన్స్ పూర్తయ్యాయి’ అని చెప్పుకొచ్చారీ జబర్తస్ద్ కమెడియన్. ప్రస్తుతం ఈ నటుడి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




