AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

165 కి.మీ రేంజ్, 2.9 సెకన్లలో 60 కి.మీ వేగం! అల్ట్రా వయోలెట్ షాక్వేవ్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ ఎప్పుడు?

ఎలక్ట్రిక్ బైక్ కోసం ఎదురుచూస్తున్న వారికి అల్ట్రావయోలెట్ నుంచి తాజా సమాచారం వచ్చింది. 2026లోనే డెలివరీలు ప్రారంభిస్తామని గతంలో ప్రకటించిన షాక్‌వేవ్ ఇప్పుడు 2027 ఫస్ట్ క్వార్టర్‌కు వాయిదా పడింది. కొత్త 100V ఆర్కిటెక్చర్‌తో మరింత శక్తి, మెరుగైన థర్మల్ సామర్థ్యం, వేగవంతమైన ఛార్జింగ్ అందించేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఉత్పత్తి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. దీంతో కస్టమర్ల నిరీక్షణ మరికొంత కాలం కొనసాగనుంది అని తెలుస్తోంది.

165 కి.మీ రేంజ్, 2.9 సెకన్లలో 60 కి.మీ వేగం! అల్ట్రా వయోలెట్ షాక్వేవ్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ ఎప్పుడు?
Ultraviolette Shockwave.jpg
Nikhil
|

Updated on: Oct 02, 2026 | 7:31 AM

Share

తేలికైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌గా ఇప్పటికే పరిచయమైన షాక్‌వేవ్‌లో ఇప్పుడు కీలక మార్పులు చేస్తున్నారు. 3.5kWh బ్యాటరీతో 165 కిలోమీటర్ల IDC రేంజ్, 14.5 bhp పవర్, 505 Nm టార్క్ వంటి వివరాలను కంపెనీ వెల్లడించింది. 0 నుంచి 60 కి.మీ వేగాన్ని 2.9 సెకన్లలో అందుకుంటుందని పేర్కొంది. సింగిల్ సీట్, డ్యూయల్ సీట్ ఎంపికలతో ఈ మోడల్ రానుంది. రోజువారీ ప్రయాణాలతో పాటు స్పోర్టీ రైడింగ్‌ను దృష్టిలో పెట్టుకుంది.

మరింత శక్తివంతంగా

అల్ట్రావయోలెట్ షాక్‌వేవ్‌ను తొలిసారిగా 2025లో ప్రదర్శించింది. తేలికైన, వేగవంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌గా దీనిని పరిచయం చేశారు. తొలి 1,000 మంది కస్టమర్ల కోసం రూ.1.49 లక్షల ఎక్స్-షోరూమ్ ధరను కూడా ప్రకటించారు. అయితే ప్రొడక్షన్ వెర్షన్‌లో కొత్త 100V ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించాలని కంపెనీ నిర్ణయించింది.

ఈ మార్పుతో పవర్ డెలివరీ, బ్యాటరీ థర్మల్ మేనేజ్‌మెంట్, ఛార్జింగ్ సామర్థ్యం మెరుగుపడతాయని సంస్థ చెబుతోంది. ప్రస్తుతం ఈ బైక్ కోసం ఉత్పత్తి లైన్ ఏర్పాటు చేసే పనులు కూడా ప్రారంభమైనట్లు వెల్లడించింది. ఈ కారణంగానే 2026 డెలివరీ షెడ్యూల్ మారినట్లు కంపెనీ తెలిపింది.

2.9 సెకన్లలో 60 కి.మీ వేగం

షాక్‌వేవ్‌లో 3.5kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 165 కిలోమీటర్ల IDC రేంజ్ వస్తుందని కంపెనీ పేర్కొంది. తక్కువ బరువును దృష్టిలో పెట్టుకుని ఈ మోటార్‌సైకిల్‌ను రూపొందించారు. సింగిల్ సీట్, డ్యూయల్ సీట్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి రానుంది.

పనితీరు విషయానికి వస్తే ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 14.5 bhp పవర్, వెనుక చక్రం వద్ద 505 Nm టార్క్ అందిస్తుంది. 0 నుంచి 60 కి.మీ వేగాన్ని కేవలం 2.9 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ చెబుతోంది. ఇదే సమయంలో టెసరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను కూడా 2027 జనవరికి వాయిదా వేసింది. దాని పూర్తి ధర, వేరియంట్లు, ఫీచర్లను లాంచ్ సమయంలో వెల్లడించనుంది.

Follow Us