AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో 433 అంగన్‌వాడీ ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేడే చివరి రోజు!

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మహిళలకు ఉద్యోగ అవకాశం. ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 433 అంగన్‌వాడీ టీచర్‌, హెల్పర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హత గల మహిళా అభ్యర్థులు అక్టోబర్‌ 23, 2026లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు మరికొన్ని గంటలే గడువు ఉన్నందున ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోండి..

తెలంగాణలో 433 అంగన్‌వాడీ ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేడే చివరి రోజు!
Kumuram Bheem Asifabad Anganwadi Recruitment
Srilakshmi C
|

Updated on: Oct 23, 2026 | 2:28 PM

Share

తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో అంగన్‌వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు కీలక అప్డేట్‌ జారీ చేసింది. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్‌, హెల్పర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 433 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజు మాత్రమే గడువు ఉంది. ఆసక్తి కలిగిన వారు అక్టోబర్‌ 23, 2026 రాత్రి 11.59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలోని ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో అంగన్‌వాడీ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ప్రాజెక్టుల వారీగా పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో అంగన్‌వాడీ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • సిర్పూర్‌-టి: మొత్తం 28 పోస్టులు. ఇందులో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 9, హెల్పర్‌ పోస్టులు 19 ఉన్నాయి.
  • కాగజ్‌నగర్‌: మొత్తం 11 పోస్టులు. టీచర్‌ పోస్టులు 4, హెల్పర్‌ పోస్టులు 7 ఉన్నాయి.
  • ఆసిఫాబాద్‌: మొత్తం 124 పోస్టులు. టీచర్‌ పోస్టులు 49, హెల్పర్‌ పోస్టులు 75 ఉన్నాయి.
  • జైనూర్‌: మొత్తం 163 పోస్టులు. టీచర్‌ పోస్టులు 39, హెల్పర్‌ పోస్టులు 124 ఉన్నాయి.
  • వాంకిడి: మొత్తం 107 పోస్టులు. టీచర్‌ పోస్టులు 52, హెల్పర్‌ పోస్టులు 55 ఉన్నాయి.

ఈ ఐదు ప్రాజెక్టుల్లో కలిపి 433 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 153 అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు, 280 హెల్పర్‌ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విద్యార్హతలను కలిగి ఉండాలి. సాధారణంగా ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత తప్పనిసరిగా పేర్కొనబడింది. అయితే, అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులకు ఇంటర్మీడియట్‌ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అందుబాటులో లేనప్పుడు, పదో తరగతి ఉత్తీర్ణులను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు స్థానిక మహిళా అభ్యర్థులే అర్హులు. పట్టణ ప్రాంతాల్లో సంబంధిత వార్డుకు, గ్రామీణ ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రం ఉన్న గ్రామ పంచాయతీ పరిధికి చెందినవారై ఉండాలి.

ఈ అర్హతలు ఉన్నవారు అక్టోబర్ 23, 2026వ తేదీ ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అంగన్‌వాడీ టీచర్‌, హెల్పర్‌ పోస్టుల భర్తీకి నిర్ణీత ఎంపిక విధానాన్ని అనుసరిస్తారు. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఇచ్చిన వివరాల ప్రకారం ఇంటర్మీడియట్‌ మార్కులకు 70 శాతం వెయిటేజీ, వితంతువులకు 5 శాతం, అనాథలకు 10 శాతం, దివ్యాంగులకు 5 శాతం వెయిటేజీతో పాటు ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయిస్తారు. తుది ఎంపికకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్‌లోని నిబంధనలే వర్తిస్తాయి. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని అంగన్‌వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే మహిళలు అక్టోబర్‌ 23, 2026లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. చివరి రోజు కావడంతో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవడం మంచిది. దరఖాస్తు చేసే ముందు ఖాళీలు, విద్యార్హతలు, వయోపరిమితి, స్థానికత, ఎంపిక విధానం వంటి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో మరోసారి తనిఖీ చేసుకోవాలి.

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో అంగన్‌వాడీ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us