AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఐరన్‌రాడ్‌తో నరమేధం సృష్టించే సైకో కిల్లర్.. ఓటీటీ ట్రెండింగ్‌ టాప్‌లో రియల్ క్రైమ్ స్టోరీ

ఈ వీకెండ్ లో మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ చూడాలనుకుంటున్నారా? అయితే ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ సైకో థ్రిల్లర్ సినిమాను అసలు మిస్ కావద్దు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ సినిమాకు ఐఎమ్ డీబీలో టాప్ రేటింగ్ ఉండడం మరో విశేషం.

OTT Movie: ఐరన్‌రాడ్‌తో నరమేధం సృష్టించే సైకో కిల్లర్.. ఓటీటీ ట్రెండింగ్‌ టాప్‌లో రియల్ క్రైమ్ స్టోరీ
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 20, 2026 | 10:05 PM

Share

ఓటీటీలో ఇప్పుడు సస్పెన్స్, హారర్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాలదే హవా. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలను తెగ చూసేస్తున్నారు ఆడియెన్స్. అందులోనూ ఈ మధ్యన రియల్ స్టోరీలకు ఆదరణ బాగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే వివిధ ఓటీటీ సంస్థలు ప్రతి వారం ఇతర భాషల్లో హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లను ఆయా భాషల్లోకి అనువాదం చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రా అండ్ రస్టిక్ సైకో థ్రిల్లర్ మూవీ. 1960ల కాలంలో ముంబై మహా నగరాన్ని వణికించిన ఒక సైకో సీరియల్ కిల్లర్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. చేతిలో ఇనుప రాడ్ పట్టుకుని, దారిన పోయే అమాయకులను దారుణంగా హత్య చేసే ఓ సైకో కిల్లర్, అలాగే డ్రగ్స్‌కి అలవాటు పడిన ఓ కరెప్టెడ్ పోలీస్ ఆఫీసర్‌కి మధ్య జరిగే సైకలాజికల్ వార్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఊహించని ట్విస్టులు చాలానే ఉన్నాయ. కొన్ని సీన్స్ అయితే ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తాయి. అలాగే ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా ఎంతో రేసీగా ఉంటుంది. ఎక్కడా బోరు కొట్టదు. అందుకే ఐఎమ్ డీబీలోనూ ఈ సైకో థ్రిల్లర్ సినిమాకు టాప్ రేటింగ్ దక్కడం విశేషం. అన్నట్లు తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల ఇందులో ఒక కీలక పాత్ర పోషించడం విశేషం.

ప్రస్తుతం ఓటీటీలో ట్రెండింగ్ అవుతోన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘రమన్ రాఘవ్ 2.0’ (Raman Raghav 2.0). 1960ల కాలంలో ముంబై నగరాన్ని వణికించిన సైకో సీరియల్ కిల్లర్ ‘రమన్ రాఘవ్’ నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సైకో కిల్లర్ పాత్రలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ జీవించేశారని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో విలన్ గా నటిస్తోన్న అనురాగ్ కశ్యప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. అలాగే ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న విక్కీ కౌశల్ ఈ మూవీలో పోలీసాఫీసర్ గా నటించారు. భారీగా డ్రగ్స్ తీసుకుంటూ లోపల తీవ్రమైన హింసాత్మక కోణం ఉన్న పోలీస్‌గా విక్కీ నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది. వీకెండ్ లో మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us