AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది.. ఒంటరిగా చూస్తే అంతే సంగతులు

వెన్నులో వణుకు పుట్టించే సీన్లతో నిండి ఉన్న ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఆదివారం (ఆగస్టు 23) స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇంగ్లిష్ తో పాటు తెలుగు ఇతర ప్రధాన భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉండడంతో ఆడియెన్స్ తెగ చూసేస్తున్నారు.

OTT Movie: ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది.. ఒంటరిగా చూస్తే అంతే సంగతులు
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 24, 2026 | 9:03 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు రాన్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన చిత్రాలు, వెబ్ సిరీస్ లు సందడి చేయనున్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఐ నోబడీ’, మైఖేల్, బబితా సింగ్ రిపోర్టింగ్, అన్బే డయానా, ఆల్ఫా, బంధర్ సినిమాలతో పాటు ఆకలిరాజ్యం 2026, పార్ట్ టైమర్స్ వంటి వెబ్ సిరీస్ లు కూడా ఈ వారంలోనే ఓటీటీ ఆడియెన్స్ కు అందుబాటులో రానున్నాయి. అయితే అంతకు ముందే ఓ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. వెన్నులో వణుకు పుట్టించే సీన్లతో ఉన్న ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు అతి భయానకంగా, హింసాత్మకంగానూ ఉన్నాయి. కాబట్టి ఈ హారర్ థ్రిల్లర్ సినిమాను పిల్లలకు అసలు చూపించవద్దు. ఈ సినిమా స్టోరీ సింపుల్ గా ఉన్నా మేకింగ్, స్క్రీన్ ప్లే మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది. ఓ నర్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. జూలియా ఓ హాస్పిన్ నర్స్ (తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారిని చూసుకునే నర్స్). తీవ్రమైన డిమెన్షియాతో బాధ పడుతున్న ఈవ్లిన్ అనే వృద్ధురాలిని చూసుకోవడానికి జూలియా ఆమె ఇంటికి వెళ్తుంది. నగరానికి దూరంగా ఉండే ఆ ఇల్లు చాలా భయానకంగా ఉంటుంది. దీనికి తోడు రాత్రి అయ్యే కొద్దీ ఆ వృద్ధురాలి ప్రవర్తన చాలా వింతగా, భయానకంగానూ మారుతుంది. దీంతో జూలియా భయపడుతుంది. ఆమె బాడీలో ఏదో దెయ్యం ఉందని తెలుసుకుంటుంది. మరి ఆ భయంకరమైన ఇల్లు, వృద్ధురాలి నుంచి జూలియా ఎలా బయటపడిందన్నదే ఈ సినిమా స్టోరీ.

ప్రస్తుతం ఓటీటీలో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా పేరు బరీ ది డెవిల్(Bury The Devil). ఆడమ్ ఓబ్రియాన్ తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ సినిమాలో ఇమ్మాన్యుయేల్ లుసియర్ మార్టినెజ్, డాన్ ఫోర్ట్, బిల్ రోవాట్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఎక్కడా ఎడిటింగ్ కట్స్ లేకుండా, ఒకే కంటిన్యూయస్ టేక్ (వన్-షాట్)తో రూపొందిన ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ డైరెక్టుగా ఓటీటీలో రిలీజైంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తో పాటు తమిళం, తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. ర్రర్, మైండ్-బెండింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్. అయితే పిల్లలకు మాత్రం ఈ సినిమాను చూపించకపోవడమే ఉత్తమం.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో బరీ ది డెవిల్..

బరీ ది డెవిల్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పెళ్లి ఆలస్యమవుతోందా..? మంగళ దోషం ప్రభావం కావచ్చు.. ఈ పరిహారాలతో
పెళ్లి ఆలస్యమవుతోందా..? మంగళ దోషం ప్రభావం కావచ్చు.. ఈ పరిహారాలతో
ధర మారదు.. బరువు పెరగదు.. పార్లే-జి వేల కోట్ల లాభాల వెనుకున్న..
ధర మారదు.. బరువు పెరగదు.. పార్లే-జి వేల కోట్ల లాభాల వెనుకున్న..
ప్రియురాలితో దొరికిపోయిన భర్త..భార్యను కారుతో ఈడ్చుకెళ్లిన దారుణం
ప్రియురాలితో దొరికిపోయిన భర్త..భార్యను కారుతో ఈడ్చుకెళ్లిన దారుణం
ట్రైన్ జర్నీ చేసే ప్రతి ఒక్కరూ ఇవి పాటించాల్సిందే.. లేదంటే
ట్రైన్ జర్నీ చేసే ప్రతి ఒక్కరూ ఇవి పాటించాల్సిందే.. లేదంటే
ఆ ఒక్కదెబ్బతో స్టోరీనే మార్చేశారట
ఆ ఒక్కదెబ్బతో స్టోరీనే మార్చేశారట
ఇంకా మిస్టరీగానే ఇద్దరి పైలట్ల పేర్లు.. ఫ్లై దుబాయ్ హీరోలు ఎవరు?
ఇంకా మిస్టరీగానే ఇద్దరి పైలట్ల పేర్లు.. ఫ్లై దుబాయ్ హీరోలు ఎవరు?
'సిగ్మా'ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
'సిగ్మా'ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
పైలట్లకు జీతం ఎంత ఉంటుంది..? వామ్మో.. ఎంతంటే..?
పైలట్లకు జీతం ఎంత ఉంటుంది..? వామ్మో.. ఎంతంటే..?
జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా?తింటే ఏమవుతుంది.. వైద్యుల సూచన
జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా?తింటే ఏమవుతుంది.. వైద్యుల సూచన
సోమవారం శివుడితో పాటు చంద్రుడిని ఎందుకు పూజిస్తారు? గంగాజలంతో..
సోమవారం శివుడితో పాటు చంద్రుడిని ఎందుకు పూజిస్తారు? గంగాజలంతో..