AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గులాబీ మొక్క కొమ్మ కొమ్మకి మొగ్గలు రావాలి అంటే ఇది ఒక్క స్పూన్ వేయండి.. నర్సరీ రహస్యం ఇదే!

ఇంటి పెరట్లో లేదా బాల్కనీ కుండీలలో గులాబీ మొక్కలను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. అయితే చాలామందికి గులాబీ మొక్కలకు కొత్త చిగుర్లు రాకపోవడం, వచ్చిన చిన్న మొగ్గలు మాడిపోయి రాలిపోవడం లేదా వర్షాకాలంలో మట్టిలో ఫంగస్, తెగుళ్లు చేరి మొక్కలు ఎండిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి.

Phani CH
|

Updated on: Aug 24, 2026 | 9:13 PM

Share
మార్కెట్లో దొరికే రసాయన ఎరువులు వాడితే మొక్కలు కొద్దిరోజులే పూలు పూసి తర్వాత చనిపోయే ప్రమాదం ఉంది. ఆగస్టు నుంచి మొదలయ్యే సీజన్‌లో మొక్కలకు ఎటువంటి రసాయనాలు లేకుండా, వంటింట్లో దొరికే వస్తువులతోనే సంపూర్ణ పోషకాలను అందించే సహజసిద్ధమైన ఎరువును ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

1 / 5
గులాబీలకు అవసరమైన ముఖ్య పోషకాలు: మొక్కల వేర్లు దృఢంగా ఉండటానికి కాల్షియం, కొత్త చిగుర్లు వేగంగా రావడానికి నైట్రోజన్, మరియు వర్షాకాలంలో మట్టిలో ఫంగస్ రాకుండా రక్షణ కల్పించే యాంటీ-ఫంగల్ పదార్థాలు గులాబీ మొక్కకు ఎంతో అవసరం.

2 / 5
హోమ్‌మేడ్ ఫెర్టిలైజర్ తయారీ విధానం:కాల్షియం కోసం ఉడకబెట్టని పచ్చి గుడ్ల పెంకులను శుభ్రంగా కడిగి రెండు రోజుల పాటు ఎండబెట్టాలి. రెండు గుప్పెళ్ల ఎండిన గుడ్ల పెంకులను తీసుకోవాలి. తరువాత యాంటీ-ఫంగల్ కోసం ఒక గుప్పెడు మెంతులను తీసుకోవాలి. మెంతులు మట్టిలో ఫంగస్, సూక్ష్మ క్రిములు రాకుండా వేర్లను బలంగా ఉంచుతాయి.

3 / 5
తరువాత నైట్రోజన్ కోసం రెండు చెంచాల కాఫీ పొడి లేదా వాడిన టీ పొడిని కలపాలి. ఇది కొత్త చిగుర్లు వేగంగా, ఎర్రగా బలంగా రావడానికి దోహదపడుతుంది. తరువాత  మిక్సీ జార్‌లో వేసి తడి లేకుండా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో కాఫీ పొడిని కలిపి గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.

4 / 5
ఎరువును చల్లే విధానం: కుండీ లేదా నేలలో ఉన్న మొక్క మొదలుకు కాస్త దూరంగా మట్టిని లూజ్ చేయాలి. కుండీలో ఉన్న మొక్కకు ఒకటిన్నర టీస్పూన్, నేలలో ఉన్న పెద్ద మొక్కకు రెండు నుండి మూడు టీస్పూన్ల పొడిని మట్టిలో వేసి కప్పేయాలి. ఎరువు వేసిన తర్వాత మొక్కకు తగినన్ని నీళ్లు పోయాలి. ఈ ఎరువును వారానికి లేదా పది రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటే కొమ్మ కొమ్మకి మొగ్గలు తొడిగి పూలు పెద్ద సైజులో పూస్తాయి. కుండీలను రోజుకు కనీసం రెండు నుండి మూడు గంటల పాటు ఎండ తగిలే ప్రదేశంలో ఉంచాలి.
ఈ సులువైన సహజసిద్ధమైన చిట్కాలు పాటిస్తే మీ గులాబీ మొక్కలు సీజన్ మొత్తం పూలతో నిండిపోతాయి!

ఎరువును చల్లే విధానం: కుండీ లేదా నేలలో ఉన్న మొక్క మొదలుకు కాస్త దూరంగా మట్టిని లూజ్ చేయాలి. కుండీలో ఉన్న మొక్కకు ఒకటిన్నర టీస్పూన్, నేలలో ఉన్న పెద్ద మొక్కకు రెండు నుండి మూడు టీస్పూన్ల పొడిని మట్టిలో వేసి కప్పేయాలి. ఎరువు వేసిన తర్వాత మొక్కకు తగినన్ని నీళ్లు పోయాలి. ఈ ఎరువును వారానికి లేదా పది రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటే కొమ్మ కొమ్మకి మొగ్గలు తొడిగి పూలు పెద్ద సైజులో పూస్తాయి. కుండీలను రోజుకు కనీసం రెండు నుండి మూడు గంటల పాటు ఎండ తగిలే ప్రదేశంలో ఉంచాలి. ఈ సులువైన సహజసిద్ధమైన చిట్కాలు పాటిస్తే మీ గులాబీ మొక్కలు సీజన్ మొత్తం పూలతో నిండిపోతాయి!

5 / 5
Follow Us
గులాబీలు విరగ పూయాలి అంటే ఇది ఒక్క స్పూన్ వేయండి చాలు

నూనె ట్యాంకర్ బోల్తా.. బకెట్లు, క్యాన్లతో ఎగబడ్డ జనం! వీడియో

ఇలా కూడా ఔటవుతారా.. ఆ ఒక్క తప్పుతో ఊహించని షాకిచ్చిన అంపైర్..

ఈ కామర్స్ కంపెనీలకు షాక్.. ఆన్‌లైన్ లో ఈ పండు కొంటే నేరమే!

జలుబు పట్టిందా? మందులకంటే ముందు ఈ డ్రింక్స్ ట్రై చేయండి!

OTTలో భయానక హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది.. పెద్దలకు మాత్రమే

మనసున్న కలెక్టర్ .. మాన‌వ‌త్వంతో స్పందించారు

యూపీఐ ద్వారా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేస్తే ఐటీ నోటీసులొస్తాయా?

గిల్‌కు ఇచ్చిపడేసిన పంత్.. డబ్ల్యూటీసీలో తోపుగాడిగా భారీ రికార్డ్

మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..