AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిమ్మ తొక్కే కదా అని పారేస్తున్నారా.. ఈ స్మార్ట్‌ బెనిఫిట్స్ తెలిస్తే తొక్కలే కావాలంటారు​!

మన వంటగదిలో నిమ్మకాయల వాడకం చాలా ఎక్కువ. అయితే, రసం పిండిన తర్వాత చాలామంది ఆ తొక్కలను పారేస్తుంటారు. కానీ, ఆ నిమ్మ తొక్కలలో అద్భుతమైన క్లీనింగ్, సువాసన గుణాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా? రసాయనాలతో కూడిన క్లీనర్లకు బదులుగా, నిమ్మ తొక్కలను ఉపయోగించి ఇల్లు, వంటగదిని ఎలా మెరిపించవచ్చో.. ఆ స్మార్ట్ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: Jul 13, 2026 | 8:26 PM

Share
వంటగది ప్లాట్‌ఫారమ్ లేదా గ్యాస్ స్టవ్ చుట్టూ పేరుకుపోయే నూనె, జిడ్డు మరకలపై నిమ్మ తొక్కలతో నేరుగా రుద్దాలి. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ జిడ్డును క్షణాల్లో వదిలిస్తుంది. ఆ తర్వాత తడి గుడ్డతో తుడిస్తే వంటగది క్లీన్‌గా మారడమే కాక మంచి సువాసన వస్తుంది. బాత్‌రూమ్, కిచెన్ కుళాయిలపై నీటి వల్ల తెల్లటి ఉప్పు మరకలు లేదా గార పేరుకుపోతుంటుంది. నిమ్మ తొక్కతో ఆ కుళాయిలపై బాగా రుద్ది, ఒక 10 నిమిషాల తర్వాత నీటితో కడిగేస్తే, అవి కొత్తవాటిలా మెరుస్తాయి. స్టీల్ సింక్‌లను శుభ్రం చేయడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.

1 / 5
ఫ్రిజ్ దుర్వాసనకు చెక్: ఫ్రిజ్‌లో రకరకాల ఆహార పదార్థాలు పెట్టడం వల్ల ఒక్కోసారి వింత దుర్వాసన వస్తుంది. ఒక చిన్న గిన్నెలో కొన్ని నిమ్మ తొక్కలను ఉంచి, దానిని ఫ్రిజ్‌లో ఒక మూల పెట్టండి. ఇవి ఫ్రిజ్‌లోని చెడు వాసనలను పీల్చుకుని, లోపల ఎల్లప్పుడూ తాజాదనాన్ని అందిస్తాయి.

2 / 5
మైక్రోవేవ్ ఓవెన్ క్లీనింగ్: ఒక గాజు గిన్నెలో నీరు తీసుకుని, అందులో కొన్ని నిమ్మ తొక్కలను వేయాలి. ఆ గిన్నెను మైక్రోవేవ్‌లో పెట్టి 3-5 నిమిషాల పాటు వేడి చేయాలి. లోపల ఆవిరి బాగా పడుతుంది. ఆ తర్వాత ఓవెన్ స్విచ్ ఆఫ్ చేసి, లోపలి భాగాలను కాటన్ గుడ్డతో తుడిస్తే, లోపల ఉన్న మొండి మురికి, ఆహారపు వాసనలు పూర్తిగా తొలగిపోతాయి.

3 / 5
చీమలు, కీటకాల నివారణ: చీమలు, బొద్దింకలకు నిమ్మకాయలోని ఘాటైన వాసన అస్సలు పడదు. చీమలు ఎక్కువగా వచ్చే కిటికీల మూలలు, తలుపుల సందులు లేదా కిచెన్ క్యాబినెట్లలో ఈ తొక్కలను ఉంచడం వల్ల కీటకాలు ఆ ప్రాంతాల దరిచేరవు.

4 / 5
కాఫీ, టీ కప్పుల మరకలు: ఎక్కువ కాలం వాడటం వల్ల సిరామిక్ లేదా గాజు కప్పుల లోపల కాఫీ, టీ మరకలు పడుతుంటాయి. ఆ కప్పులలో కొద్దిగా ఉప్పు వేసి, నిమ్మ తొక్కతో లోపలి భాగాలను బాగా రుద్దితే మరకలు మాయమై కప్పులు తెల్లగా మారుతాయి. ఇకపై నిమ్మకాయలను వాడిన తర్వాత వాటి తొక్కలను పారేయకుండా, ఈ చిట్కాలతో మీ ఇంటిని కెమికల్స్ లేకుండా సులభంగా, సహజసిద్ధంగా శుభ్రం చేసుకోండి!

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..