AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: అస్సలు డౌట్ రాకుండా ఐఫోన్ కొట్టేసిన యువతి! ఎలా దొరికిందంటే..

కోయంబత్తూరులో సెల్‌ఫోన్ కొనుగోలుదారిలా నటించిన ఓ యువతి చాకచక్యంగా ఐఫోన్ 13ను దొంగిలించింది. ఉద్యోగి దృష్టి మరల్చి ఫోన్‌ను బ్యాగ్‌లో వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. సీసీటీవీ ఫుటేజీలో ఘటన రికార్డు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి మహిళ కోసం గాలిస్తున్నారు.

Video: అస్సలు డౌట్ రాకుండా ఐఫోన్ కొట్టేసిన యువతి! ఎలా దొరికిందంటే..
Iphone 13 Stolen
SN Pasha
|

Updated on: Aug 04, 2026 | 3:19 PM

Share

సెల్‌ఫోన్ కొనుగోలు చేయడానికి వచ్చిన కస్టమర్‌లా నటించింది. దుకాణ సిబ్బంది దృష్టి మరల్చి ఖరీదైన ఐఫోన్‌ను బ్యాగ్‌లో వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొద్ది సేపటికి ఓనర్ ఫోన్ లేకపోవడాన్ని చూసి షాక్ అయ్యాడు. షాప్‌లోని సీసీటీవీ రికార్డు చూసి బిత్తరపోయాడు. ఎంతో చాకచక్యంగా ఓ యువతి ఖరీదైన ఐఫోన్‌ను దొంగిలించింది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటు చేసుకుంది.

కస్టమర్‌గా నటించి..

కోయంబత్తూరు జిల్లా గాంధీపురం సిటీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ప్రముఖ టెక్స్‌టైల్స్ సమీపంలోని ఓ ప్రైవేట్ మొబైల్ ఫోన్ షాప్‌కి ఓ యువతి వచ్చింది. సెల్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు చెప్పి, దుకాణంలో ఉన్న వివిధ మోడళ్లను చూపించాలని సిబ్బందిని కోరింది. దీంతో ఉద్యోగులు ఒక్కొక్కటిగా పలు కంపెనీలకు చెందిన మొబైల్ ఫోన్‌లను షోకేస్ నుంచి తీసి టేబుల్‌పై ఉంచి ఆమెకు చూపించడం ప్రారంభించారు.

ఉద్యోగి దృష్టి మరల్చి ఐఫోన్ బ్యాగ్‌లో

ఫోన్‌లను పరిశీలిస్తున్నట్లు నటించిన యువతి, మరో మోడల్ చూపించాలని ఉద్యోగిని కోరింది. ఉద్యోగి వెనక్కి తిరిగి మరో ఫోన్ తీసుకురావడానికి వెళ్లిన క్షణాన్ని అవకాశంగా మార్చుకుంది. టేబుల్‌పై ఉన్న ఐఫోన్ 13ను చాకచక్యంగా తన బ్యాగ్‌లో వేసుకుంది. అనంతరం ఏమాత్రం అనుమానం రాకుండా సాధారణంగా మాట్లాడి, ఎలాంటి కొనుగోలు చేయకుండా దుకాణం నుంచి బయటకు వెళ్లిపోయింది.

వీడియో చూడండి

సీసీటీవీలో బట్టబయలు

కొద్దిసేపటి తర్వాత ఉద్యోగులు టేబుల్‌పై ఉన్న ఫోన్‌లను తిరిగి షోకేస్‌లో సర్దుతుండగా ఒక ఐఫోన్ కనిపించకపోవడంతో అప్రమత్తమయ్యారు. వెంటనే  యువతిని వెతికినా అప్పటికే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, యువతి ఐఫోన్‌ను బ్యాగ్‌లో వేసుకుంటున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. దుకాణ యజమాని సీసీటీవీ వీడియోతో సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. ఫుటేజీ ఆధారంగా యువతిని గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా, ఈ చోరీకి సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కస్టమర్‌లా నటించి క్షణాల్లో ఖరీదైన మొబైల్‌ను దొంగిలించిన యువతి తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు దుకాణదారులు విలువైన వస్తువులను వినియోగదారులకు చూపించే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఫిట్‌గా ఉంటే పక్కన పెట్టొద్దు..సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన
ఫిట్‌గా ఉంటే పక్కన పెట్టొద్దు..సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన
ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..?
ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..?
వాడు నాశనమైపోతారు.. నేల నాకిపోతాడు..!
వాడు నాశనమైపోతారు.. నేల నాకిపోతాడు..!
సెంచరీల్లో సచిన్‌దే పైచేయి.. కానీ ఈ రికార్డులో కోహ్లీనే కింగ్
సెంచరీల్లో సచిన్‌దే పైచేయి.. కానీ ఈ రికార్డులో కోహ్లీనే కింగ్
ఎల్‌బీనగర్‌లో ఓ సంచితో తచ్చాడుతూ కనిపించిన మహిళ.. ఆరా తీస్తే
ఎల్‌బీనగర్‌లో ఓ సంచితో తచ్చాడుతూ కనిపించిన మహిళ.. ఆరా తీస్తే
భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఈ కారణాలు తెలుసుకుంటే షాక్ అవు
భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఈ కారణాలు తెలుసుకుంటే షాక్ అవు
ఫుల్ ట్యాంక్ చేస్తే 1200 కి.మీ ప్రయాణం.. ఈ కారు సరికొత్త రికార్డు
ఫుల్ ట్యాంక్ చేస్తే 1200 కి.మీ ప్రయాణం.. ఈ కారు సరికొత్త రికార్డు
ఈ 7 కలలు వస్తే అదృష్టం తలుపు తడుతున్నట్టే.. కష్టాలు తొలగి సుఖ..
ఈ 7 కలలు వస్తే అదృష్టం తలుపు తడుతున్నట్టే.. కష్టాలు తొలగి సుఖ..
సన్న బియ్యం Vs స్టీమ్ బియ్యం.. ఆరోగ్యానికి ఏవి మంచివి..?
సన్న బియ్యం Vs స్టీమ్ బియ్యం.. ఆరోగ్యానికి ఏవి మంచివి..?
వ్యాపారం లాభాల బాట పట్టాలంటే.. ఈ వాస్తు టిప్స్ తప్పక తెలుసుకోండి!
వ్యాపారం లాభాల బాట పట్టాలంటే.. ఈ వాస్తు టిప్స్ తప్పక తెలుసుకోండి!