మనతో పాటు ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకునే దేశాలు ఇవే

14 August 2026

Anand T

200 ఏళ్ల బ్రిటీష్‌ పాలన నుంచి విముక్తి పొంది 80 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది.

స్వాతంత్ర్యం

అయితే మనతో పాటు ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకునే ఇతర దేశాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా?

స్వాతంత్ర్యం

అవును భారతదేశంతో పాటు మరో ఐదు దేశాలు కూడా ఆగస్ట్ 15వ తేదీని స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాయి. అవేంటో చూద్దాం.

భారత్

ఫస్ట్‌ ఉత్తర కొరియా.. ఇది కూడా 1945లో జపాన్ ఆక్రమణ నుంచి విముక్తి పొందిన ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం 'విముక్తి దినోత్సవం' జరుపుకుంటుంది.

ఉత్తర కొరియా

రెండోది దక్షిణ కొరియా.. రెండవ ప్రపంచ యుద్ధం ముగింపులో 1945లో జపాన్ పాలన నుండి విముక్తి పొందిన ఆగస్టు 15న దక్షిణ కొరియా తన స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది.

దక్షిణ కొరియా

మూడోది లీచ్‌టెన్‌స్టైన్.. ఐరోపా ఖండంలోని చిన్న దేశమైన లీచ్‌టెన్‌స్టైన్‌ కూడా ఇదే రోజున జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది.

లీచ్‌టెన్‌స్టైన్

నాలుగోది బహ్రెయిన్.. ఈ దేశం 1971 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిన సందర్భంగా స్వాతంత్ర్యం దినోత్సవాన్ని జరుపుకుంటుంది.

 బహ్రెయిన్

ఐదోది రిపబ్లిక్ ఆఫ్ కాంగో.. 1960లో ఫ్రెంచ్ వలస పాలన నుండి విముక్తి పొందిన సందర్భంగా ఈ దేశం కూడా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది.

 రిపబ్లిక్ ఆఫ్ కాంగో