AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్.. జస్ట్ ఈ నెంబర్‌కు Hi అని మెసేజ్ చేస్తే చాలు..

ఏపీలోని దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం అందిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. దివ్యాంగులకు ఎంతో ముఖ్యమైన సదరం సర్ఫిఫికెట్ పొందేందుకు ఇకపై కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సేవలను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో దివ్యాంగులు ఇంటిదగ్గరి నుంచే సదరం సర్టిఫికెట్ స్లాట్ బుకింగ్‌తో పాటు డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు.

కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్.. జస్ట్ ఈ నెంబర్‌కు Hi అని మెసేజ్ చేస్తే చాలు..
Ap Sadaram Certificate Whatsapp
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Aug 04, 2026 | 7:24 PM

Share

ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇప్పటికే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వందలాది ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు దివ్యాంగులకు అత్యంత అవసరమైన సదరం సేవలను కూడా అదే వేదికపైకి తీసుకొచ్చింది. ఇకపై సదరం స్లాట్ బుకింగ్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సర్టిఫికెట్ కోసం నిరీక్షించాల్సిన పనిలేదు. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు.. క్షణాల్లో సేవలు పొందే అవకాశం కల్పించింది కూటమి ప్రభుత్వం.

సదరం సర్టిఫికెట్ కోసం గతంలో మీ సేవా కేంద్రాలు, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలను ఆశ్రయించాల్సి వచ్చేది. స్లాట్ కోసం వేచి ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ ప్రక్రియను పూర్తిగా డిజిటల్‌గా మార్చారు. దివ్యాంగులు ఎక్కడ ఉన్నా.. అక్కడి నుంచే వాట్సాప్ ద్వారా సదరం సేవలు పొందే అవకాశం కల్పించారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఈ సేవలను మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో దివ్యాంగులు కార్యాలయాలకు వెళ్లకుండా ఇంటి నుంచే సదరం సేవలు పొందగలుగుతున్నారు.

వాట్సాప్‌లో ఈ సేవలు ఎలా వినియోగించుకోవాలి?

  • మొదటగా లబ్ధిదారులు తమ మొబైల్‌లో వాట్సాప్ అప్లికేషన్‌ను ఓపెన్ చేయాలి.
  • ఇప్పుడు మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009 ను సేవ్ చేసుకుని, దానికి Hi అని మెసేజ్ పంపాలి.
  • మెసేజ్ పంపిన తర్వాత స్క్రీన్‌పై కనిపించే Citizen Services విభాగంలో Sadaram Services ను ఎంచుకోవాలి.
  • అక్కడ మీకు ప్రధానంగా సదరం స్లాట్ లభ్యత (Slot Availability) , సదరం స్లాట్ బుకింగ్ (Slot Booking) ,సదరం సర్టిఫికెట్ డౌన్‌లోడ్ (Certificate Download) అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి
  • స్లాట్లు బుక్‌ చేసుకోవాలని అనుకునేవారు లభ్యతను బట్టి మీకు వీలైన తేదీ, సమయాన్ని ఎంచుకుని వెంటనే స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
  • స్లాట్ వివరాలు వాట్సాప్‌లోనే లభించడం వల్ల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన, వేచి చూడాల్సిన అవసరం ఉండదు.
  • ఇప్పటికే సదరం సర్టిఫికెట్ ఉన్నవారు దానిని నేరుగా వాట్సాప్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ విధానం ద్వారా స్లాట్ బుకింగ్ ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. ఎలాంటి మధ్యవర్తుల అవసరం లేకుండా.. దరఖాస్తుదారే నేరుగా సేవలు పొందే అవకాశం ఉండటంతో సేవల పంపిణీ మరింత వేగవంతం కానుందని అంటున్నారు. అలాగే ప్రయాణ ఇబ్బందులు ఎదుర్కొనే దివ్యాంగులకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడనున్నాయని.. సర్టిఫికెట్, స్లాట్ బుకింగ్, స్లాట్ లభ్యత వంటి సేవలన్నీ ఒకే వేదికపై అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందనున్నాయని తెలిపారు.

డిజిటల్ గవర్నెన్స్‌ను మరింత విస్తరిస్తూ.. ప్రజలకు సేవలను వారి చేతి వేళ్ల మీదకు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సదరం సేవలను మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌లో అందుబాటులోకి తేవడం కూడా అదే దిశలో మరో కీలక చర్యగా అధికారులు చెబుతున్నారు. ఈ అవకాశాన్ని రాష్ట్రంలోని దివ్యాంగులందరూ వినియోగించుకోవాలని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ విజ్ఞప్తి చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..
కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..
చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!
చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!
ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పులు ఎలా వస్తాయి?
ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పులు ఎలా వస్తాయి?
శ్రీలంకపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే
శ్రీలంకపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే
తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
తాటి బెల్లంలో అసలైనది ఏది? నకిలీది ఏది? గుర్తించడం ఎలా..?
తాటి బెల్లంలో అసలైనది ఏది? నకిలీది ఏది? గుర్తించడం ఎలా..?
బుమ్రా ఆస్తి విలువ తెలిస్తే ఫ్యూజులు అవుట్ కావాల్సిందే
బుమ్రా ఆస్తి విలువ తెలిస్తే ఫ్యూజులు అవుట్ కావాల్సిందే
కన్న తల్లిని, కడుపున పుట్టిన కూతురిని.. ఒకే రోజు హతమార్చిన కసాయి
కన్న తల్లిని, కడుపున పుట్టిన కూతురిని.. ఒకే రోజు హతమార్చిన కసాయి
ఎప్పటికైనా ఆ తెలుగు స్టార్ హీరో సినిమాలో నటించాలన్నది నా కోరిక
ఎప్పటికైనా ఆ తెలుగు స్టార్ హీరో సినిమాలో నటించాలన్నది నా కోరిక
తస్సాదియ్యా.. కలెక్టర్‌నే బెదిరించిన ఇంటర్‌పోల్ అధికారులు!
తస్సాదియ్యా.. కలెక్టర్‌నే బెదిరించిన ఇంటర్‌పోల్ అధికారులు!
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!