AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆలయంలో అద్భుతం.. పవిత్ర సోమవారం శివాలయంలో ప్రత్యక్షమైన నాగేంద్రుడు!

విజయనగరం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరొందిన సంగం సంగమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఉదయం అరుదైన దృశ్యం భక్తులను ఆకట్టుకుంది. భక్తులంతా స్వామివారి పూజలు చేస్తుండగా ఆలయంలో అకస్మాత్తుగా నాగుపాము ప్రత్యక్షం కావడంతో భక్తుల్లో భక్తిభావం వెల్లివిరిసింది. పవిత్రమైన సోమవారం రోజున నాగేంద్రుడు ఆలయంలో దర్శనమివ్వడాన్ని భక్తులు శుభసూచకంగా భావించారు.

ఆలయంలో అద్భుతం.. పవిత్ర సోమవారం శివాలయంలో ప్రత్యక్షమైన నాగేంద్రుడు!
Vizianagaram Sangameswara Temple
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Aug 24, 2026 | 9:19 PM

Share

విజయనగరం జిల్లాలో ప్రసిద్ధ సంగమేశ్వర ఆలయంలో అద్భుత దృష్యం ఆవిష్కృతమైంది. నిత్యపూజల్లో భాగంగా ఆయన ప్రధాన అర్చకులు సిద్ధాంతం గణపతి రావు స్వామివారి విగ్రహాలకు అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ఓ నాగుపాము బుసలు కొడుతూ ఆలయ ప్రాంగణంలోకి వచ్చింది. గుడిలో కనిపించిన నాగుపామును చూసిన అర్చకులు, భక్తులు మొదట భయాందోళనకు గురైనా.. ఆ తర్వాత కొంత ధైర్యం తెచ్చుకొని అది స్వామివారు పంపిన నాగశేషుడేనని భక్తితో నమస్కరించారు. దీంతో ఆ నాగషేషు సైతం భక్తులకు ఎవరికి ఎలాంటి హాని చేయకుండా కాసేపటి తర్వాత అక్కడే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది.

సోమవారం శివారాధనకు ఎంతో విశిష్టమైన రోజుగా భావించే నేపథ్యంలో నాగుపాము ప్రత్యక్షం కావడం విశేషంగా మారింది. నాగేంద్రుడు స్వయంగా శివుని ఆభరణంగా, శివతత్వానికి ప్రతీకగా భక్తులు విశ్వసిస్తారు. దీంతో ఈ ఘటనను శివుని అనుగ్రహంగా భావించిన భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగేంద్రుడికి నమస్కరించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయంలో నాగుపాము కనిపించిందన్న విషయం పరిసర ప్రాంతాల్లోని భక్తులకు తెలియడంతో పలువురు ఆలయానికి చేరుకున్నారు.

ఈ అరుదైన దృశ్యాన్ని చూసిన భక్తులు ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యారు. పవిత్ర సోమవారం రోజున సంగమేశ్వర స్వామి ఆలయంలో నాగేంద్రుడి దర్శనం లభించడం తమకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని పలువురు భక్తులు పేర్కొన్నారు. సంగం సంగమేశ్వర స్వామి ఆలయంలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనంతో పాటు నాగేంద్రుడి దర్శనం కూడా లభించడంతో ఆనందం వ్యక్తం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నెలల పసిపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో మేలు చేసే గోధుమ రవ్వ కిచిడి
నెలల పసిపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో మేలు చేసే గోధుమ రవ్వ కిచిడి
పవిత్ర సోమవారం శివాలయంలో ప్రత్యక్షమైన నాగేంద్రుడు
పవిత్ర సోమవారం శివాలయంలో ప్రత్యక్షమైన నాగేంద్రుడు
గులాబీలు విరగ పూయాలి అంటే ఇది ఒక్క స్పూన్ వేయండి చాలు
గులాబీలు విరగ పూయాలి అంటే ఇది ఒక్క స్పూన్ వేయండి చాలు
నూనె ట్యాంకర్ బోల్తా.. ఆ తర్వాత సీన్ ఇదే! వీడియో వైరల్
నూనె ట్యాంకర్ బోల్తా.. ఆ తర్వాత సీన్ ఇదే! వీడియో వైరల్
ఇలా కూడా ఔటవుతారా.. ఆ ఒక్క తప్పుతో ఊహించని షాకిచ్చిన అంపైర్..
ఇలా కూడా ఔటవుతారా.. ఆ ఒక్క తప్పుతో ఊహించని షాకిచ్చిన అంపైర్..
ఈ కామర్స్ కంపెనీలకు షాక్.. ఆన్‌లైన్ లో ఈ పండు కొంటే నేరమే!
ఈ కామర్స్ కంపెనీలకు షాక్.. ఆన్‌లైన్ లో ఈ పండు కొంటే నేరమే!
జలుబు పట్టిందా? మందులకంటే ముందు ఈ డ్రింక్స్ ట్రై చేయండి!
జలుబు పట్టిందా? మందులకంటే ముందు ఈ డ్రింక్స్ ట్రై చేయండి!
OTTలో భయానక హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది.. పెద్దలకు మాత్రమే
OTTలో భయానక హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది.. పెద్దలకు మాత్రమే
మనసున్న కలెక్టర్ .. మాన‌వ‌త్వంతో స్పందించారు
మనసున్న కలెక్టర్ .. మాన‌వ‌త్వంతో స్పందించారు
యూపీఐ ద్వారా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేస్తే ఐటీ నోటీసులొస్తాయా?
యూపీఐ ద్వారా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేస్తే ఐటీ నోటీసులొస్తాయా?