AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: నవ్వుతూ నాగుపామునే బోల్తా కొట్టించింది.. నీ ధైర్యానికి దండం అక్కా.. వీడియో చూస్తే..

పాము అంటేనే ఆమడదూరం పరుగెత్తుతాం. అలాంటిది ఆ యువతి పడగవిప్పిన బుసలు కొడుతున్న నాగుపాము ఆటకట్టించింది. చేతిలో ఏం లేకున్నా కేవలం ఒక ఖాళీ ప్లాస్టిక్ డబ్బాతోనే ఆ కోబ్రా ఎంత చాకచక్యంగా బంధించిందో చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే.. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోను మీరూ చూడండి..

Video: నవ్వుతూ నాగుపామునే బోల్తా కొట్టించింది.. నీ ధైర్యానికి దండం అక్కా.. వీడియో చూస్తే..
Woman Rescues Cobra With Plastic Jar
Krishna S
|

Updated on: Aug 04, 2026 | 1:19 PM

Share

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని జనాలను ఆకట్టుకుంటనే మరికొన్ని అవాక్కయ్యేలా చేస్తాయి. అయితే తాజాగా నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఒక వీడియో మాత్రం నెటిజన్లు నోరెళ్లబెట్టేలా చేస్తుంది. ఇంట్లోకి ప్రవేశించిన ఒక భారీ నాగుపామును ఓ మహిళా స్నేక్ రెస్క్యూయర్ ఎంతో చాకచక్యంగా, ఎలాంటి భయం లేకుండా పట్టుకున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక ఇంట్లోని మెట్ల కింద భాగంలో ఒక భారీ నాగుపాము పడగవిప్పి బుసలు కొడుతూ ఉరిమేలా చూస్తుంది. అక్కడే సర్ప్‌మిత్ర లేడీ వాలంటీర్ ఎంతో ప్రశాంతంగా, నవ్వుతూనే ఒక ప్లాస్టిక్ డబ్బాను తీసుకుని పాము తల మీదుగా కప్పేసింది. పాము తల డబ్బాలోకి వెళ్లగానే.. దాన్ని ఏమాత్రం భయపెట్టకుండా, తోకను పట్టుకుని సురక్షితంగా పామును లోపలకు పంపి డబ్బా క్లోజ్ చేసింది. ఆ తర్వాత పాము ఊపిరి పీల్చుకోవడానికి వీలుగా ఆ ప్లాస్టిక్ జార్‌పై అగర్‌బత్తితో చిన్న చిన్న రంధ్రాలు చేసింది.

నెటిజన్ల ప్రశంసల వర్షం

పాములను చూస్తేనే జనం భయంతో పరుగులు తీస్తుంటారు. అలాంటిది అంత పెద్ద నాగుపామును కూల్‌గా, ఎటువంటి హడావుడి లేకుండా డబ్బాలో బంధించడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ మహిళా స్నేక్ రెస్క్యూయర్ ధైర్యాన్ని, పాము పట్ల ఆమె చూపించిన శ్రద్ధను నెటిజన్లు ప్రశంసిస్తూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

వీడియో చూడండి..

Follow Us