AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళి వేళ సామాన్యులకు ఊరట.. దిగొచ్చిన కూరగాయల ధరలు.. రైతు బజార్లలో నేటి ధరలివే..

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా దీపావళి పండుగ వేళ టమాటా, ఉల్లిపాయలతో సహా పలు నిత్యావసర కూరగాయల ధరలు పడిపోవడంతో సామాన్యులకు ఎంతో ఉపశమనం లభించింది. హైదరాబాద్, గుంటూరు రైతు మార్కెట్లలో ధరల వివరాలు చూద్దాం.

దీపావళి వేళ సామాన్యులకు ఊరట.. దిగొచ్చిన కూరగాయల ధరలు.. రైతు బజార్లలో నేటి ధరలివే..
Kukatpally Rythu Bazaar Vegetable Prices
Venkatrao Lella
|

Updated on: Oct 31, 2026 | 12:24 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో వినియోగదారులకు భారీ ఊరట లభిస్తోంది. ముఖ్యంగా దీపావళి పండుగ వేళ ధరలు దిగిరావడం సామాన్యులకు ఎంతో మేలు చేకూరుస్తోంది. ఉల్లి, టమాటాలతో పాటు పలు ఇతర కూరగాయల ధరలు మొన్నటివరకు ఎగబాకగా.. ప్రస్తుతం స్ధిరంగా కొనసాగుతున్నాయి. దీపావళి పండుగ రానుండటంతో ఇంటి ఖర్చు పెరుగనుంది. ఈ క్రమంలో కూరగాయల ధరలు దిగి రావడం శుభవార్తగా చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 31వ తేదీన ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్ మార్కెట్లో నేటి కూరగాయల ధరలివే.

కూకట్‌పల్లి మోడ్రన్, మోడల్ రైతు బజార్‌లో శనివారం రోజున కిలో టమాటా రూ.27, వంకాయ రూ.18, బెండకాయ రూ.45, పచ్చి మిర్చి రూ.45, బజ్జి మిర్చి రూ.50, కాకరకాయ రూ.38, బీరకాయ రూ.38, క్యాబేజీ రూ13, బీన్స్ రూ.60, క్యారెట్ రూ.45 పలుకుతుండగా.. గోబీపువ్వు రూ.30, దొండకాయ రూ.25, చిక్కుడుకాయ రూ.45, గోరుచిక్కుడు రూ.35, బీట్ రూట్ రూ.28, క్యాప్సికం రూ.47, ఆలుగడ్డ రూ.21, కీరా (లోకల్) రూ.28కు లభిస్తోంది. అలాగే కీరా (ఇటాలియన్) రూ.40, దోసకాయ రూ.23, సొరకాయ రూ.20, పొట్లకాయ రూ.24, కంద రూ.35, ఉల్లిపారక రూ.55కు విక్రయిస్తున్నారు. ఇక కేజీ ఉల్లిగడ్డ రూ.40, పచ్చి మామిడికాయ ఒక్కొక్కటి రూ.15 నుండి రూ20, అరటికాయ ఒక్కొకటి రూ.9 నుండి రూ10, చామగడ్డ రూ35, ముల్లంగి ఒక్కొకటి రూ. 6 నుండి రూ8కి అమ్ముతున్నారు. ఇక చిలగడ దుంప రూ.40, గుమ్మడికాయ రూ.40, నిమ్మకాయలు (డజను) రూ.50 నుండి రూ60, మునగకాయలు ఒక్కొకటి రూ.10 నుండి రూ12, బొప్పాయి రూ50గా ఉంది. ఇక పుట్టగొడుగులు (200 గ్రాములు) రూ50, ఎండు మిర్చి రూ.280, పాత అల్లం రూ.180, కొత్త అల్లం రూ.120, వెల్లుల్లి రూ.60, చింతపండు రూ.160, పండు మిర్చి రూ.80, ఉసిరి రూ.80, కరివేపాకు రూ.60, పల్లికాయ రూ.55గా కొనసాగుతున్నాయి.

గుంటూరులో కూరగాయల ధరలు..

ఇక గుంటూరులోని ఎన్టీఆర్ రైతు బజార్‌లో కిలో టమాటా రూ.37, వంగ రూ.24, బెండ రూ.29, పచ్చిమిర్చి రూ.44, కాకర రూ.38, బీర రూ.44, క్యారెట్ రూ.42, క్యాబేజీ రూ.24. దొండ రూ.19, బంగాళదుంప రూ.24, ఉల్లి రూ.48, గోరుచిక్కుళ్లు రూ.24, దోస రూ.25, పొట్ల రూ.16,. చామ రూ.32, బీట్ రూట్ రూ.36, కీర రూ.45, క్యాప్చికం రూ.55,. అల్లం రూ.160, ఫ్రెంచిబీన్స్ రూ.75, సొర రూ.10, అరటి రూ.8, గోంగూరు రూ.8, తోటకూర రూ.20, చుక్కకూర రూ.20, మెంతికూర రూ.5, కొత్తిమీర రూ.50 పలుకుతోంది.

Follow Us