AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాత్‌రూంకు వెళ్లి ఎంతసేపటికీ బయటకు రాలేదు.. తలుపులు పగలగొట్టి చూడగా విగతజీవిగా ఎస్ఐ!

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. జర్చా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్ బాత్రూంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం పోలీస్ శాఖలో కలకలం రేపింది. చాలాసేపటి వరకు బాత్రూం నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది తలుపులు పగలగొట్టి చూడగా ఆమె విగతజీవిగా కనిపించారు.

బాత్‌రూంకు వెళ్లి ఎంతసేపటికీ బయటకు రాలేదు.. తలుపులు పగలగొట్టి చూడగా విగతజీవిగా ఎస్ఐ!
Woman Sub Inspector
Balaraju Goud
|

Updated on: Nov 17, 2026 | 1:10 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. జర్చా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్ బాత్రూంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం పోలీస్ శాఖలో కలకలం రేపింది. చాలాసేపటి వరకు బాత్రూం నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది తలుపులు పగలగొట్టి చూడగా ఆమె విగతజీవిగా కనిపించారు.

వివరాల్లోకి వెళ్తే.. మృతురాలిని రష్మిగా పోలీసులు గుర్తించారు. ఆమె 2023 బ్యాచ్‌కు చెందిన మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్. కాన్పూర్‌కు చెందిన రష్మి ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలోని జర్చా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో తోటి సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

బాత్రూం తలుపు చాలాసేపటి వరకు తెరుచుకోకపోవడంతో పోలీసు సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా రష్మి మృతదేహం కనిపించింది. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రాథమికంగా గుండెపోటు కారణంగా ఆమె మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు డీసీపీ శ్రవణ్ కుమార్ తెలిపారు. అయితే మరణానికి అసలు కారణం ఇంకా నిర్ధారణ కాలేదు.

రష్మి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. వారు వచ్చిన తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల కచ్చితమైన కారణం వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న యువ మహిళా ఎస్ఐ ఆకస్మిక మరణంతో పోలీస్ శాఖలో విషాదం నెలకొంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పోలీస్ స్టేషన్ బాత్రూంలో మహిళా ఎస్ఐ అనుమానాస్పద మృతి..!
పోలీస్ స్టేషన్ బాత్రూంలో మహిళా ఎస్ఐ అనుమానాస్పద మృతి..!
RBI సంచలన నిర్ణయం.. ఒకేసారి 63 ఫైనాన్స్ కంపెనీల లైసెన్సులను రద్దు
RBI సంచలన నిర్ణయం.. ఒకేసారి 63 ఫైనాన్స్ కంపెనీల లైసెన్సులను రద్దు
పెట్టింది రూ.65 కోట్లు.. హీరో రెమ్యునరేషన్ అంత కూడా రాబట్టలేదు
పెట్టింది రూ.65 కోట్లు.. హీరో రెమ్యునరేషన్ అంత కూడా రాబట్టలేదు
బాబా వంగా చివరి భవిష్యవాణి.. 2027 లో ఈ రాశుల వారికే రాజయోగం
బాబా వంగా చివరి భవిష్యవాణి.. 2027 లో ఈ రాశుల వారికే రాజయోగం
అమెరికాలో డర్టీ బాంబు దాడికి ఇరాన్ కుట్ర?
అమెరికాలో డర్టీ బాంబు దాడికి ఇరాన్ కుట్ర?
వాట్సాప్‌లో అదిరిపోయే అప్‌డేట్.. కొత్త ఫీచర్‌ రాబోతోంది..
వాట్సాప్‌లో అదిరిపోయే అప్‌డేట్.. కొత్త ఫీచర్‌ రాబోతోంది..
బకెట్ ఇలా ఉంటే వాటర్ హీటర్‌తో ప్రాణాలు పోవడం ఖాయం!
బకెట్ ఇలా ఉంటే వాటర్ హీటర్‌తో ప్రాణాలు పోవడం ఖాయం!
నాగదుర్గ ఒకొక్క పాటకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా.?
నాగదుర్గ ఒకొక్క పాటకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా.?
కేవలం రూ.50 వేలతో స్టార్ట్ చేసే బిజినెస్‌ల గురించి మీకు తెలుసా?
కేవలం రూ.50 వేలతో స్టార్ట్ చేసే బిజినెస్‌ల గురించి మీకు తెలుసా?
ఇంట్లోనే కుంకుమపువ్వు పండించడం ఎలా? కుండీలో సాగు చేసే సులువైన
ఇంట్లోనే కుంకుమపువ్వు పండించడం ఎలా? కుండీలో సాగు చేసే సులువైన