AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫోక్ సాంగ్స్ తో విపరీతమైన క్రేజ్.. నాగదుర్గ ఒకొక్క పాటకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా.?

తన డాన్స్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఫోక్స్ సాంగ్స్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అందాల భామ నాగ దుర్గ. చూడచక్కని రూపంతో చక్కటి డాన్స్ తో కట్టిపడేస్తుంది ఫోక్ డాన్సర్ నాగ దుర్గ. తన డాన్స్ తో మంది అభిమానులను సొంతం చేసుకుంది నాగ దుర్గ.

ఫోక్ సాంగ్స్ తో విపరీతమైన క్రేజ్.. నాగదుర్గ ఒకొక్క పాటకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా.?
Naga Durga
Rajeev Rayala
|

Updated on: Nov 17, 2026 | 12:42 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో జానపద పాటలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలంగాణ ఫోక్ సాంగ్స్‌కు యూట్యూబ్‌లో విపరీతమైన క్రేజ్ లభిస్తోంది. అలాంటి పాటలతో ప్రేక్షకులకు చేరువైన వారిలో నాగదుర్గ ఒకరు. తనదైన డాన్స్ స్టైల్, అదిరిపోయే ఎక్స్‌ప్రెషన్స్‌తో తక్కువ సమయంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన పాట విడుదలైందంటే చాలు.. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఇప్పటికే 300కు పైగా జానపద పాటల్లో నటించి ఫోక్ డాన్సర్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. నాగదుర్గకు భారీ గుర్తింపు తీసుకొచ్చిన పాటల్లో ‘కాపోళ ఇంటికాడ’ ఒకటి. ఈ పాటలో ఆమె వేసిన స్టెప్పులు, పలికించిన హావభావాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన ‘పేరుగళ్ల పెద్ది రెడ్డి’ పాట కూడా ఆమె పాపులారిటీని మరింత పెంచింది. ఇక ‘నా పేరే ఎల్లమ్మ’, ‘ఎర్ర రూమాల్’, ‘మామిడి కోనల మీన’, ‘దారిపొంటత్తుండు’, ‘జిల్లెలమ్మ జిట్ట’, ‘డిళ్లెం భళ్లెం ఎల్లమ్మ బోనం’, ‘అల్లల్లో నెరల్లో’ వంటి పాటలతోనూ ప్రేక్షకులను అలరించింది. ఇలా వరుసగా హిట్ ఫోక్ సాంగ్స్‌లో కనిపిస్తూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది.

నాగదుర్గకు ప్రస్తుతం ఫోక్ సాంగ్స్‌లో మంచి డిమాండ్ ఉంది. ఆమె ఒక్కో పాటకు తీసుకునే పారితోషికంపై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నాగదుర్గ ఒక్కో పాటలో డాన్స్ చేసేందుకు సుమారు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని టాక్ వినిపిస్తుంది. దీనికి అదనంగా కాస్ట్యూమ్స్ ఖర్చులు కూడా ఉంటాయని తెలుస్తోంది. అయితే పాటలో ఆమె పాత్ర, పాట స్థాయి, ఇతర అంశాలను బట్టి ఈ మొత్తం మారుతుందని సమాచారం. ఇప్పటివరకు పాటల ద్వారానే నాగదుర్గ కోటికి పైగా సంపాదించిందనే ప్రచారం కూడా ఉంది. సాధారణంగా డిమాండ్ పెరిగిన తర్వాత పారితోషికం విషయంలో చాలామంది ప్రత్యేకంగా ఆలోచిస్తుంటారు. కానీ నాగదుర్గ మాత్రం తనకు నచ్చిన పాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందట. పాటలోని సాహిత్యం, భావం బాగుంటే తక్కువ పారితోషికానికైనా చేయడానికి  రెడీ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ముఖ్యంగా డబుల్ మీనింగ్ పదాలు ఉన్న పాటలకు దూరంగా ఉంటానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. మంచి సాహిత్యం ఉన్న పాటల్లో మాత్రమే నటించాలని కోరుకుంటానని, ఈ కారణంగా కొన్ని అవకాశాలను కూడా వదులుకున్నట్లు తెలిపింది. క్రేజ్, డిమాండ్ పెరుగుతున్నా తన అభిరుచికి తగ్గట్టుగానే ముందుకు సాగడం నాగదుర్గ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

ఇప్పటివరకు జానపద పాటల్లో తన డాన్స్‌తో అలరించిన నాగదుర్గ ఇప్పుడు వెండితెరపైనా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పటికే ‘కలివనం’ సినిమాతో పాటు ధనుష్ మేనల్లుడు పవీష్ హీరోగా నటించిన ‘లవ్ హో లవ్’ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించింది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ‘ఇడుపు కాయితం’ సినిమాలో నాగదుర్గ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఫోక్ సాంగ్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ.. సినిమాల్లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us