నరాల బలహీనతను తగ్గించి శరీరాన్ని బలంగా మార్చుతాయ్.. వారంలో ఒక్కసారైనా తినండి
ఎండు చేపల్లో ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, ఐరన్, విటమిన్ B12 వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కండరాలు, ఎముకలు, నరాల ఆరోగ్యానికి తోడ్పడవచ్చు. అయితే ఎండు చేపల్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అధిక రక్తపోటు, గుండె, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా తీసుకోవాలి.

పచ్చి చేపలతోపాటు.. ఎండు చేపలు (Dry Fish) కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం.. పచ్చి చేపల కంటే.. ఎండు చేపల్లోనే.. అత్యధిక పోషకాలు కేంద్రీకృతమై ఉంటాయి.. అందుకే.. తప్పనిసరిగా ఎండు చేపలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండు చేపలల్లో ప్రోటీన్లతోపాటు.. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, పాస్ఫరస్, ఐరన్, విటమిన్ D, విటమిన్ B12, విటమిన్ A, K వంటి పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
పచ్చి చేపల కంటే ఎండు చేపల్లో అధిక నాణ్యత కలిగిన ప్రొటీన్లు ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి, నొప్పుల నివారణకు సహాయపడతాయి.
ఎండు చేపల్లోని ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి, నరాల పనితీరుకు తోడ్పడతాయి. అంతేకాకుండా.. గుండె, మెదడు పనితీరును పెంచి ఎముకలు, దంతాలు గట్టిపడేలా చేస్తాయి..
ఎండు చేపలు రక్తహీనత సమస్యను తగ్గించి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతాయి..
వీటిలో ప్రొటీన్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది.. ఇది ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
పాలు ఇచ్చే తల్లులు తింటే పాలఉత్పత్తి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
వండేటప్పుడు ఇది మస్ట్..
ఉప్పు ఎక్కువగా ఉండే రకాలను పరిమితంగా తీసుకోవాలి. శుభ్రంగా ప్రాసెస్ చేసిన, సురక్షితంగా నిల్వ చేసిన ఎండు చేపలనే ఎంచుకోవాలి.
ఎంచు చేపలు వండుకునే ముందు వీటిని గోరువెచ్చని లేదా వేడి నీటిలో శుభ్రంగా కడిగి ఉప్పు తగ్గించుకోవాలి.. ఎండుచేపలు ఏ కూరలో అయినా అద్భుతంగా ఉంటాయి.. చారులా, ఇగురు అలాగే.. కర్రీ.. టమాట, వంకాయలు ఇలా వేటిలోనైనా ఎండు చేపలను వేసుకుని అద్భుతంగా తినొచ్చు. అంతేకాకుండా పాతకాలం నాటి కర్రీలను కూడా ఎంతో కమ్మగా వండుకుని తినిచ్చు..
అయితే.. ఎండు చేపల్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అధిక రక్తపోటు, గుండె, మూత్రపిండాల సమస్యలు, అలర్జీలు, పలు అనారోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తినే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
