AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నౌకలు దాటాలంటే పన్ను కట్టాల్సిందే

నౌకలు దాటాలంటే పన్ను కట్టాల్సిందే

Samatha J
|

Updated on: Jul 16, 2026 | 2:46 PM

Share

అమెరికా-ఇరాన్ మధ్య తీవ్రమవుతున్న ఉద్రిక్తతల మధ్య, డోనాల్డ్ ట్రంప్ హర్ముజ్ జలసంధిని నియంత్రించి కార్గో నౌకలపై 20% పన్ను విధించాలని ప్రతిపాదించారు. ఇది ప్రపంచ చమురు సరఫరాను ప్రభావితం చేస్తుంది. భారత్ వంటి దేశాలపై ముడి చమురు దిగుమతి వ్యయాలు పెరిగి, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది.

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పర్షియన్ గల్ఫ్‌ను మూసివేస్తున్నట్లు ఇరాన్ గతంలో ప్రకటించగా, ఇప్పుడు హర్ముజ్ జలసంధిపై నియంత్రణ తమదేనని, కార్గో నౌకలపై 20 శాతం పన్ను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ఇరాన్‌పై ప్రారంభించాయి. దీనికి ప్రతిస్పందనగా, అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో అంతర్జాతీయంగా చమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత నెలలో కుదిరిన ఒప్పందం తాత్కాలికంగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో, హర్ముజ్ జలసంధిని తాము స్వాధీనం చేసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్ కార్యక్రమంలో మాట్లాడుతూ, హర్ముజ్ జలసంధిపై పరిస్థితిని అదుపులోకి తీసుకుంటామని, ప్రస్తుతం ఇరాన్‌కు పెద్దగా ప్రత్యామ్నాయం లేదని వ్యాఖ్యానించారు. దాదాపు 47 ఏళ్ల కిందటే ఇరాన్ ముప్పును అమెరికా పరిష్కరించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. హర్ముజ్ జలసంధిని తమ ఆధీనంలోనే ఉంచుకుంటామని, అవసరమైతే తామే నిర్వహిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ఈ మార్గానికి అమెరికానే రక్షణగా ఉంటుందని, అయితే దీనికి గాను తగిన రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

‘రామాయణ’ కోసం మేకర్స్ కొత్త ప్రమోషనల్ ప్లాన్..

బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడానికి సిద్ధమవుతున్న యశ్

‘ఊరు వాడ’ కార్యక్రమం రాజకీయాల కోసమా ? ఫ్యాన్స్ ఏమన్నారు ?

నాగార్జున ఆ విషయంలో రిస్క్ తీసుకుంటున్నారా..?

Follow Us