రిలీజ్‌కు ముందే మేకింగ్ వీడియోతో నోలన్ సర్‌ప్రైజ్
'ఓపెన్‌హైమర్'తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన హాలీవుడ్ స్టార్ క్రిస్టోఫర్ నోలన్... జూలై 17న 'ది ఒడిస్సీ' సినిమాతో థియేటర్లలోకి రాబోతున్నారు. ఈ ఎపిక్ యాక్షన్ ఫిల్మ్‌కి అడ్వాన్స్ బుకింగ్స్ మోత మోగిపోతున్నాయి. కేవలం మల్టీప్లెక్స్ ప్రేక్షకులే కాదు, రూరల్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఓ హాలీవుడ్ సినిమాకు ఇండియాలో ఇంత క్రేజేంటి..? ఆ క్రేజ్ వెనుక సీక్రెట్ ఏంటి?
మ్యాట్ డామన్, టామ్ హాలండ్, జెండయా లాంటి స్టార్ కాస్ట్‌తో తెరకెక్కిన ‘ది ఒడిస్సీ’ ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు రానుంది. నోలన్ గత సినిమాలు ఇండియాలో రికార్డ్ కలెక్షన్స్ సాధించాయి. ముఖ్యంగా గతేడాది వచ్చిన ‘ఓపెన్‌హైమర్’ 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్ సెట్ చేసింది. ఇక ‘ఇంటర్‌స్టెల్లార్’, ‘ఇన్‌సెప్షన్’, ‘డార్క్ నైట్’ లాంటి చిత్రాలు ఇప్పటికీ మన ప్రేక్షకుల ఫేవరెట్ లిస్ట్‌లో టాప్‌లో ఉంటాయి. ఆయన గత చిత్రాల సక్సెస్, ఆ ట్రాక్ రికార్డే ఇప్పుడు ‘ది ఒడిస్సీ’ అడ్వాన్స్ బుకింగ్స్ మీద భారీ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి.ఇండియాలో ‘ది ఒడిస్సీ’ అడ్వాన్స్ బుకింగ్స్ కళ్లు చెదిరేలా ఉన్నాయి. రిలీజ్‌కి ముందే ఏకంగా రూ. 15 కోట్లకు పైగా ప్రీ-సేల్స్ జరగగా.. ఫస్ట్ డే కోసమే 5.75 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ నమోదయ్యాయి. ముంబై లాంటి చోట్ల టికెట్ రేటు 3100 వరకు పెంచినా ఆడియన్స్ బుక్ చేసుకుంటున్నారు. రేట్లు పెరగడంతో ఓపెన్‌హైమర్ కంటే తక్కువ టికెట్లు అమ్ముడైనా, రెవెన్యూ పరంగా మాత్రం నోలన్ ఖాతాలో మరో సాలిడ్ రికార్డ్ పడటం ఖాయంగా కనిపిస్తోంది.
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

