ఆహా.. ఐడియా అదిరింది..ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?
సోషల్ మీడియాలో కీర్తన మీనన్ అనే యువతి గుండు కొట్టించుకున్న వీడియో వైరల్‌గా మారింది. ఇష్టంలేని పెళ్లి తప్పించుకోవడానికే ఇలా చేసిందని కొందరు నెటిజన్లు భావిస్తుండగా, దీని వెనుక అసలు కారణంపై స్పష్టత లేదు. దేవాలయ మొక్కు, జుట్టు దానం లేదా వ్యూస్ కోసం చేసిన పనా అనే చర్చకు ఈ వీడియో దారితీసింది.
సోషల్ మీడియా యుగంలో ఏ చిన్న వింత జరిగినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా, కీర్తన మీనన్ అనే యువతికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారి తీసింది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో కీర్తన ప్రశాంతంగా కూర్చుని ఉండగా, ఓ బార్బర్ ఆమె జుట్టును పూర్తిగా తీసేస్తున్నాడు. ఈ దృశ్యంతో పాటు ఆమె పెట్టిన క్యాప్షన్ మరింత వివాదాస్పదంగా మారింది. మా అమ్మ నా పెళ్లి ప్లాన్ చేసింది అంటూ ఆమె తన పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకొచ్చింది. ముఖంలో ఎలాంటి బాధ లేకుండా ఆమె గుండు చేయించుకోవడం గమనార్హం. ఇది బలవంతపు పెళ్లికి వ్యతిరేకంగా ఆమె చేసిన నిరసనలా అనిపిస్తున్నా, దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని కీర్తన స్పష్టం చేయలేదు. ఇది నిజంగా పెళ్లి తప్పించుకోవడానికి చేసిన పనా, దేవాలయంలో మొక్కుబడిగా చేసినదా, క్యాన్సర్ రోగుల కోసం జుట్టు దానమా లేక కేవలం వ్యూస్ కోసమే చేసిన ఒక క్రేజీ స్టంటా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆధునిక సమస్యలకు లెజెండరీ పరిష్కారం అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతూ ఈ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
‘రామాయణ’ కోసం మేకర్స్ కొత్త ప్రమోషనల్ ప్లాన్..
బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడానికి సిద్ధమవుతున్న యశ్
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

