మల్లె పూలతో నాగినీ ఘాటైన సెగలు..అబ్బో అందమే అందం!
అందాల ముద్దుగుమ్మ మౌనీరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాగినీ సీరియల్‌తో మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ చిన్నది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా, తెల్ల చీరలో, నెత్తిన మల్లెలతో నాగినీలా వంపు తిరుగుతూ.. తన అందంతో ఘాటైన సెగలు కురిపిస్తూ ఉన్న ఫొటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది.
Updated on: Oct 08, 2025 | 1:26 PM

నాగినీ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. బుల్లితెరపై నాగినీ సీరియల్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది.

ఈ బ్యూటీ తన అందంతో సీరియల్ ద్వారా ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది. ఈ ముద్దుగుమ్మ సీరియల్‌లో తన నటన అందంతో మంచి గుర్తింపు తెచ్చుకొని బుల్లితెరపై నుంచి వెండితెరపైకి అడుగు పెట్టింది. బ్రహ్మాస్త్రం సినిమాలో కీలక పాత్రలో మెరిసి, తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి.

ఇక ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో ఆఫర్స్ కొట్టేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ బ్యూటీ బుల్లితెరపై, వెండితెరపై తమ నటనతో ఆకట్టుకోవడమే కాకుండా, స్పెషల్ సాంగ్‌లో కూడా మెరవనుంది. తెలుగులో చిరంజీవి విశ్వంభర సినిమాలో ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఏ కాస్త సమయం దొరికినా సరే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.

రీసెంట్‌గా దుబాయ్ ఏడారుల్లో తన అందంతో సందడి చేసిన ఈ చిన్నది, తాజాగా జెడలో మల్లెపూలు, చేతులకు గోరింటాకు , పారాణితో దర్శనం ఇచ్చింది. ఈ ఫొటోల్లో ఈ బ్యూటీ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ మధ్య ఈ అమ్మడు సింగిల్‌గా కనిపించడంతో తన భర్తతో మనస్పర్థు వచ్చి ఈ బ్యూటీ సింగిల్ గా ఉంటుందంటూ అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.



