AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malla Reddy: ఆ తెలుగు సినిమాలో విలన్ ఆఫర్.. రూ.3 కోట్లు కూడా ఇస్తామన్నారు.. కానీ: మల్లారెడ్డి

మల్లారెడ్డి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరంటే అతి శయోక్తి కాదు. రాజకీయ నేతగా, విద్యావేత్తగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. పేరుకు రాజకీయ నాయకుడైనా సందర్భమొస్తే చాలు చిన్నపిల్లాడిలా డ్యాన్స్ లు, గట్రాలు చేస్తుంటారు మల్లారెడ్డి.

Malla Reddy: ఆ తెలుగు సినిమాలో విలన్ ఆఫర్.. రూ.3 కోట్లు కూడా ఇస్తామన్నారు.. కానీ: మల్లారెడ్డి
BRS MLA Malla Reddy
Basha Shek
|

Updated on: Oct 08, 2025 | 9:57 PM

Share

‘పాలమ్మినా.. పూలమ్మినా’ అంటూ ఒకే ఒక్క డైలాగ్ తో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిపోయారు బీఎర్ఎస్ నేత, ఎమ్మెల్యే మల్లారెడ్డి. రాజకీయవేత్తగా ఆయన చెప్పే మాటలు, డైలాగులకు, ప్రసంగాలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే పాలిటిక్స్ లో ఉన్నా చాలా సార్లు తనలోని కళామతల్లిని కూడా బయట పెడుతుంటార మల్లారెడ్డి. పండగలు, పబ్బాలు, పెళ్లిళ్లు, కాలేజీ ఈవెంట్లు, ఇలా ఏ సందర్భమొచ్చినా చిన్న పిల్లాడిలా డ్యాన్స్ లు చేస్తుంటారీ రాజకీయ నేత. ఇక మెగాస్టార్ చిరంజీవిని అమితంగా అభిమానిస్తారు మల్లారెడ్డి. ఈ విషయాన్ని ఆయనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడంటే పెద్దగా కనిపించడం లేదు కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పలు సినిమా ఈవెంట్లు, ఫంక్షన్లకు హాజరయ్యారు మల్లా రెడ్డి. సినిమాలు, నటీనటులు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. తాజాగా దసరా పండగను పురస్కరించుకుని ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు సీనియర్ రాజకీయ నేత. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర విసయాన్ని పంచుకున్నారాయన. తనకు ఓ తెలుగు సినిమా లో విలన్ గా నటించే ఆఫర్ వచ్చిందని, భారీ రెమ్యునరేషన్ కూడా ఇస్తామన్నారని మల్లా రెడ్డి చెప్పుకొచ్చారు. ఇంతకీ మల్లారెడ్డిని సినిమాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ఆ డైరెక్టర్ మరెవరో కాదు హరీశ్ శంకర్.

‘ టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తన సినిమాలో నాకు విలన్ పాత్రను ఆఫర్ చేశారు. ఆ రోల్ కోసం మా కాలేజీకి వచ్చి ఒక గంటసేపు వెయిట్ చేశాడు. అంతేకాకుండా రూ.3 కోట్ల పారితోషికం కూడా ఆఫర్ చేశాడు. అయినా కూడా నేను ఆ విలన్ పాత్రను ఒప్పుకోలేదు.స విలన్‌గా చేస్తే ఇంటర్వెల్‌దాకా నేను హీరోను కొడతా.. ఆ తర్వాత హీరో నన్ను కొడతాడు.. తిడతాడు’ అంటూ మల్లారెడ్డి చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా హరీశ్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. పోలీస్ కాప్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈమూవీలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఉస్తాద్ మూవీలో విలన్ కోసమే హరీశ్ శంకర్ మల్లారెడ్డిని సంప్రదించినట్లు గతంలో కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు స్వయంగా మల్లారెడ్డే ఈ విషయాన్ని బయట పెట్టారు.

ఇవి కూడా చదవండి

మల్లా రెడ్డి కామెంట్స్.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..