AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : అలాంటి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. ఒక్కో సినిమా అరాచకమే.. ఓటీటీలో గత్తరలేపుతున్న టాలీవుడ్ హీరోయిన్..

థియేటర్లలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తుంటాయి. లవ్ స్టోరీస్, రొమాంటిక్ డ్రామాలు సైతం మంచి విజయాన్ని సాధిస్తాయి. కానీ సినిమాల్లో చాలా సీన్లకు సెన్సార్ అడ్డుకట్ట వేస్తుంది. కానీ ఇప్పుడు ఓటీటీలో అస్సలు అలాంటిదేం లేదు. ముఖ్యంగా కొన్ని వెబ్ సిరీస్ మాత్రం డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రచ్చ చేస్తున్నాయి. అలాగే హీరోయిన్స్ సైతం ఓటీటీలో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Actress : అలాంటి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. ఒక్కో సినిమా అరాచకమే.. ఓటీటీలో గత్తరలేపుతున్న టాలీవుడ్ హీరోయిన్..
Radhika Apte
Rajitha Chanti
|

Updated on: Mar 14, 2026 | 10:59 AM

Share

ప్రస్తుతం ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. మిస్టరీ, సస్పెన్స్, రొమాంటిక్ డ్రామా చిత్రాలు, వెబ్ సిరీస్ మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్స్ సైతం ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ టాలీవుడ్ హీరోయిన్ ఓటీటీ క్వీన్ అనే చెప్పాలి. ఆమె కేవలం ట్రెండ్ ఫాలో కాలేదు. ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడు ఓటీటీలో బోల్డ్ చిత్రాలకు ఆమె కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఆమె మరెవరో కాదు. రాధిక ఆప్టే. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మాత్రం సత్తా చాటుతుంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

రాధిక ఆప్టే… ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు, వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ ప్రపంచంలో బిజీగా ఉంటుంది. 1985 సెప్టెంబర్ 7న జన్మించిన రాధిక.. మొదట థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసింది. 2005లో వాహ్! లైఫ్ హో తో ఐసీ! సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. కానీ 2015లో వచ్చిన బద్లాపూర్, హంటర్, మాంఝీ : ది మౌంటైన్ మ్యాన్ సినిమాలు ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఈ సినిమాలతో ఆమె తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకుంది. గ్లామరస్ బ్యూటీగా, అటు సహజ నటనతో ఈ అమ్మడు ప్రశంసలు అందుకుంది. 2018 ఏడాది ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. ఆ ఒక్క ఏడాదిలోనే నెట్ ఫ్లిక్స్ లో ఆమె నటించిన మూడు ప్రాజెక్టులు విడుదలయ్యాయి. దీంతో ఆమె నెట్ ఫ్లిక్స్ ఓటీటీ క్వీన్ గా మారింది.

ఎక్కువమంది చదివినవి : Actress : మగాళ్ల నుంచి నన్ను నేను కాపాడుకోలేకపోయాను.. టాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్..

లస్ట్ స్టోరీస్ సినిమాతో ఆమె ఇండియన్ సినిమా రూల్స్ బ్రేక్ చేసింది. ఈ పాత్రకు ఆమెకు ఏకంగా ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్ కు నామినేట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన సెక్రెడ్ గేమ్స్, ఘోల్, రాత్ అకేలీ హై, మోనికా ఓ మై డార్లింగ్ చిత్రాలతో నటిగా తానెంటో ప్రూవ్ చేసుకుంది. ఇక 2024లో వచ్చిన సిస్టర్ మిడ్ నైడ్ సినిమాతో బ్రిటిష్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డ్స్‌లో నామినేషన్ దక్కించుకుని.. ఇంటర్నేషనల్ లెవల్లో సత్తా చాటింది. అటు సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్. నిత్యం గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తుంది.

ఎక్కువమంది చదివినవి : Actress : డబ్బు కోసమే అలాంటి సినిమాల్లో నటించా.. ఓపెన్‏గా చెప్పేసిన హీరోయిన్..

View this post on Instagram

A post shared by Radhika (@radhikaofficial)

ఎక్కువమంది చదివినవి : సీరియల్స్‏లో లక్షల్లో సంపాదన.. శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే..

Follow Us
ఎముకలకు బలాన్నిచ్చే కోడి కాళ్ల సూప్.. ఇలా తింటే ఎన్ని లాభాలో..
ఎముకలకు బలాన్నిచ్చే కోడి కాళ్ల సూప్.. ఇలా తింటే ఎన్ని లాభాలో..
బక్రీద్ పండుగ ఆ రోజు కాదు.. సెలవుపై అంతటా గందరగోళం..
బక్రీద్ పండుగ ఆ రోజు కాదు.. సెలవుపై అంతటా గందరగోళం..
ఐపీఎల్‌లో కోటీశ్వరుడు.. ఆటలో నిత్య దరిద్రుడు.. కట్‌చేస్తే.
ఐపీఎల్‌లో కోటీశ్వరుడు.. ఆటలో నిత్య దరిద్రుడు.. కట్‌చేస్తే.
మహిళా రైతుపై తోపుడుబండ్ల వ్యాపారుల దాడి..మామిడి పండ్లు రోడ్డుపాలు
మహిళా రైతుపై తోపుడుబండ్ల వ్యాపారుల దాడి..మామిడి పండ్లు రోడ్డుపాలు
కోళ్లగూడు క్లీన్ చేస్తుంటే ఊహించని సీన్.. ఎర్రతేలు వీపుపై ఏముందో
కోళ్లగూడు క్లీన్ చేస్తుంటే ఊహించని సీన్.. ఎర్రతేలు వీపుపై ఏముందో
హార్ట్ షేప్ సరస్సు..ఇంతటి అందం..దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉందంటే..
హార్ట్ షేప్ సరస్సు..ఇంతటి అందం..దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉందంటే..
ఇది కరెక్ట్ కాదు సార్.. సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుబట్టిన విశాల్
ఇది కరెక్ట్ కాదు సార్.. సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుబట్టిన విశాల్
తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండలు.. మరో 4 రోజుల పాటు..
తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండలు.. మరో 4 రోజుల పాటు..
వాస్తు : ఇంటికి దురదృష్టం తెచ్చే మొక్కలు ఇవే.. ఎక్కడ ఉన్నా నష్టమే
వాస్తు : ఇంటికి దురదృష్టం తెచ్చే మొక్కలు ఇవే.. ఎక్కడ ఉన్నా నష్టమే
వైభవ్ సూర్యవంశీకు ఆ బలహీనత.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్..!
వైభవ్ సూర్యవంశీకు ఆ బలహీనత.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్..!