పవన్‌కు ప్రియురాలిగా, మహేష్‌కు అక్కగా నటించిన ఏకైక టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆ హీరోతో పెళ్లి, విడాకులు
ఒక సినిమాలో హీరోయిన్‌గా నటించిన అమ్మాయి.. మరో సినిమాలో అదే హీరోకు లేదా మరో హీరోకు చెల్లెలిగా, అక్కగా నటించిన సందర్భాలు బోలెడున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న హీరోయిన్ కూడా మహేష్ అక్కగా, పవన్ కళ్యాణ్ గా ప్రియురాలిగా నటించింది.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోల్లో పవన్ కల్యాణ్, మహేష్ బాబులు కూడా ఒకరు. ఒకరేమో పవర్ స్టార్ గా అభిమానుల మన్ననలు అందుకుంటుంటే మరొకరు సూపర్ స్టార్ గా ఫ్యాన్స్ హృదయాల్లో నిలిచిపోయాడు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఓజీ సక్సెస్ జోష్ లో ఉన్నారు. మరోవైపు మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ లో బిజి బిజీగా ఉంటున్నాడు. కాగా పవన్ కల్యాణ్, మహేష్ బాబుల పక్కన ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ నటించాడు. బాలీవుడ్ అందాల తారలు కూడా ఈ స్టార్ హీరోలతో రొమాన్స్ చేశారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ రాశి, దేవయాని, కీర్తి రెడ్డి, అమిషా పటేల్, భూమిక, శ్రుతి హాసన్, ఇలియానా, పార్వతి మెల్టన్, త్రిష, తమన్నా, సమంత, కాజల్ అగర్వాల్ ఇలా ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించాడు. వీరిలో చాలా మంది ముద్దుగుమ్ములు మహేష్ తో కూడా రొమాన్స్ చేసిన వారే. అయితే ఓ సినిమాలో పవన్ కల్యాణ్ కు ప్రియురాలిగా నటించిన ఓ హీరోయిన్, కొన్నేళ్ల తర్వాత మరో సినిమాలో మహేష్ బాబుకు అక్కగా నటించింది. ఈ రెండు సినిమాల్లోనూ ఈ అమ్మడి పాత్రలు బాగా హైలెట్ అయ్యాయి. సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా? తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి.
పవన్ కల్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీగా నిలిచిన చిత్రం తొలిప్రేమ. కరుణాకరన్ తెరకెక్కించిన ఈ మూవీలో కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించింది. పవన్ ప్రేమించే అను పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో కీర్తి అందం, అభినయానికి అప్పటి కుర్రకారు ఫిదా అయిపోయారు. దీని తర్వాత చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసిందీ అందాల తార. అయితే తొలిప్రేమ అంతటి సక్సెస్ ఇవ్వలేకపోయాయి. దీంతో అర్జున్ సినిమాలో మహేష్ అక్క పాత్రలో నటించింది కీర్తి. ఇందులో మీనాక్షి పాత్రలో అద్భుత అభినయానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా అందుకుంది.
కాగా అక్కినేని హీరో సుమంత్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది కీర్తి రెడ్డి. అయితే కొన్ని కారణాలవల్ల వీరిద్దరూ విడిపోయారు. ఆ తరువాత కీర్తి రెడ్డి మరొకరిని పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిలైందని సమాచారం. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలతో పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది.
కీర్తి రెడ్డి ఫొటో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








