OTT Movie: భయపెట్టే అద్దం.. ఓటీటీలోకి వచ్చేసిన 4065 కోట్ల హారర్ థ్రిల్లర్.. హార్ట్ పేషెంట్స్ మాత్రం చూడొద్దు
సెప్టెంబర్ 5, 2025న ఈ హారర్ థ్రిల్లర్ సినిమా థియేటర్లలో రిలీజైంది. ఫస్ట్ డే నుంచి భారీ కలెక్షన్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ తో పాటు ఇండియాలోనూ రికార్డు కలెక్షన్లు సాధించింది. ఓవరాల్ గా మొత్తం రూ.4065 కోట్ల కలెక్షన్లను ఖాతాలో వేసుకున్న ఈమూవీ మంగళవారం నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

ప్రస్తుతం ఓటీటీలో క్రైమ్, హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలదే హవా. భాషతో సంబంధం లేకుండా మరీ ఈ జానర్ చిత్రాలను చూస్తున్నారు ఆడియెన్స్. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు ప్రతి వారం ఈ రకమైన సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. అలా మంగళవారం (అక్టోబర్ 07) ఒక లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఉపాధ్యాయుల దినోత్సవం కానుకగా సెప్టెంబర్ 05న విడుదలైన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. రూ.488 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ ఓవరాల్ గా రూ.4065 కోట్ల కలెక్షన్లు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టిన ఈ హారర్ థ్రిల్లర్ ఇండియాలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన అమెరికన్ మూవీగా నిలిచింది. ఇదొక సూపర్ నేచురల్ హారర్ సినిమా. 1964లో ఎడ్, వారెన్ ఓ మిర్రర్ తో కూడిన హంటింగ్ కేసును ఎంక్వైరీ చేస్తారు. అయితే ఆ మిర్రర్ లో వారెన్ తన భవిష్యత్ ను, బిడ్డ పుట్టకపోవడాన్ని చూపిస్తుంది. కానీ ఆ బిడ్డ పుడుతుంది. ఆమెకు జ్యూడీ అనే పేరు పెడతారు.. కట్ చేస్తే.. 22 ఏళ్ల తర్వాత ఆ అద్దం జ్యూడీని వెంటాడుతూనే ఉంటుంది. ఆ అద్దాన్ని పగలగొట్టేస్తారు. అయినా ఓ పెద్దావిడ, ఓ అమ్మాయి, గొడ్డలితో ఉన్న ఓ పురుషుడు వెంటపడుతూనే ఉంటారు. మరి ఆ అద్దం వెనక ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలసిందే.
కాంజురింగ్ సిరీస్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఫ్రాంఛైజీలో తెరకెక్కిన తొమ్మిదో సినిమా ‘ది కాంజురింగ్ లాస్ట్ రైట్స్’. . స్మర్ల్ హంటింగ్ కేస్ ఆధారంగా మైకెల్ చావ్స్ ఈ హారర్ థ్రిల్లర్ ను తెరకెక్కించాడు. ఇందులో వెర ఫార్మింగా, పాట్రిక్ విల్సన్, మియా, బెన్ తదితరులు నటించారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం (అక్టోంబర్ 07) నుంచి ‘ది కాంజురింగ్ లాస్ట్ రైట్స్’ ను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ప్రస్తుతం ఈ సినిమా రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. ఫ్రీగా చూడాలంటే మరికొన్ని రోజలు ఆగాల్సిందే.
రెంటల్ విధానంలో మాత్రమే..
#TheConjuring: Last Rites (English) is now available on PVOD for the US audience.
In 4K & Dolby Atmos.#TheConjuringLastRites pic.twitter.com/aRSZLBULhT
— OTT Gate (@OTTGate) October 7, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








