డార్లింగ్ పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నారా?అయితే అనుష్క మూవీ చూడాల్సిందే!
అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఇక చాలా రోజుల నుంచి ఈ అమ్మడు చిత్రపరిశ్రమకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కాగా చాలా గ్యాప్ తర్వాత ఈ బ్యూటీ ఘాటీ సినిమాతో తన అభిమానుల ముందుకు రానుంది. మరీ ఈ మూవీ ముచ్చట్లు కొన్ని తెలుసుకుందాం పదండి!
Updated on: Oct 13, 2025 | 4:05 PM

సీతమ్మోరు లంకా దహనం చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? డార్లింగ్ పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నారా? ఈ రెండు ప్రశ్నలకి ఒకటే జవాబు ఘాటి ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది.. అనుష్క నటించిన ఘాటిలో ఇంతకీ ఏం ఉంది?

గ్లామర్ కత్తి పట్టి రపరపలాడిస్తే.. సిల్వర్ స్క్రీన్ మీద నెత్తురోడిస్తే.. విక్టిమ్ క్రిమినల్‌గా మారి లెజెండ్‌గా కనిపిస్తే.. అన్నిటికీ ఒకటే ఆన్సర్ ఘాటి. అనుష్క హీరోయిన్‌గా నటించిన ఘాటి ట్రైలర్ వచ్చేసింది. అనుష్‌కతో వేదంలాంటి సినిమా చేసిన క్రిష్ జాగర్లమూడి ఈ సారి ఘాటిలో ఏం చెప్పదలచుకున్నారు?

చెప్పదలచుకున్న విషయాన్ని మూసిపెట్టి, దాచిపెట్టి ఎందుకు చెప్పడం? ఇదీ కథ అని చెప్పేస్తే పోతుంది కదా అని అనుకున్నట్టున్నారు క్రిష్. ఘాటీ గురించి ఘాటీల ఇబ్బందుల గురించి, ఘాటీ లెజెండ్‌గా మారిన విషయం గురించి, ఎదుర్కొన్న అన్యాయాల గురించి, వాళ్ల జీవితాల్లో కష్టసుఖాల గురించి ట్రైలర్‌లో పూసగుచ్చినట్టు చెప్పేశారు.

పనిలో పనిగా సెప్టెంబర్ 5న వచ్చేస్తున్నామంటూ రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు మేకర్స్. డార్లింగ్ పెళ్లెప్పుడు? అని అంటే.. వెయిటింగ్ అనే డైలాగ్ ట్రైలర్‌లో ఎక్స్ ట్రా అట్రాక్షన్‌గా ఉంది.

స్వీటీ సినిమా కోసం చాన్నాళ్లుగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ మాత్రం ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కీ, లుక్స్ కీ, పెర్ఫార్మెన్స్ కీ ఫిదా అవుతున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ ఖాయం అంటూ ఆనందపడిపోతున్నారు.




