- Telugu News Photo Gallery Cinema photos Actress Tamannaah spoke about her struggles in starting her entry into the film industry
వామ్మో తమన్నా అన్ని కష్టాలు పడిందా.. చెప్తుంటే బాధేస్తోంది కదా!
అందాల ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పా్లసిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం, తాజాగా ఈ చిన్నది, కెరీర్ స్టార్టింగ్‌లో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పింది. ప్రస్తుతం తమన్నా చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Updated on: Oct 16, 2025 | 10:55 AM

కళ్లు తడవకుండా లైఫ్‌నీ, కాళ్లు తడవకుండా సముద్రాన్ని, కష్టాలు పడకుండా ఇండస్ట్రీని దాటిన వాళ్లు లేరన్నట్టుంది తమన్న చెప్పిన మాటలు వింటుంటే. కెరీర్ తొలినాళ్లలో సౌత్‌లో తాను పడ్డ ఇబ్బందుల గురించి మాట్లాడారు మిల్కీబ్యూటీ.

చిన్నతనంలోనే ఇండస్ట్రీకి వచ్చారు తమన్నా. ఆ టైమ్‌లో ఆమెకు ఏమీ తెలియదనుకుని చాలా మంది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించేవారట. ఇలా చాలా సార్లు జరిగిందంటారు మిల్కీబ్యూటీ.

ఒకానొక సందర్భంలో పెద్ద స్టార్ హీరోతో పనిచేసే అవకాశం వచ్చిందట. కొన్ని సన్నివేశాలు చేసేటప్పుడు అన్ ఈజీగా అనిపించిందని, ఆ విషయాన్నే మేకర్స్ తో చెప్పానని, ఆ టైమ్‌లో హీరో తనని అందరి ముందు అరిచిన అరుపులు ఇంకా గుర్తున్నాయని అన్నారు తమన్నా.

హీరోయిన్‌ని మార్చేయండి అని అతను అన్నప్పటికీ, తాను సంయమనం పాటించినట్టు చెప్పారు. నెక్స్ట్ డే ఆ హీరో తన దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పారన్నారు. ఇంతకీ హీరో ఎవరని అడిగితే మాత్రం ష్.. గప్‌చుప్ అని మాట దాటేశారు తమన్నా.



