- Telugu News Photo Gallery Cinema photos Tollywood Actress Pranitha Subhash Shares Most Glamours Photos In Her Instagram
Tollywood : పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్తో బ్లాక్ బస్టర్ హిట్స్.. గ్లామర్ ఫోజులతో కవ్విస్తోన్న హీరోయిన్.. తల్లైనా తరగని అందం..
ఒకప్పుడు అందం, అభినయంతో వెండితెరపై మాయ చేసింది ఈ ముద్దుగుమ్మ. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే స్నేహితుడిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. ఈ బ్యూటీకి పాప, బాబు జన్మించారు. చాలా కాలం తర్వాత గ్లామర్ ఫోజులతో కట్టిపడేస్తుంది.
Updated on: Oct 15, 2025 | 8:45 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. ? అందం, అభినయంతో కట్టిపడేసింది. ఇప్పటికీ అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ వయ్యారి.. ఇప్పుడు గ్లామర్ ఫోజులతో రచ్చ చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..

ఈ బ్యూటీ మరెవరో కాదండి.. టాలీవుడ్ బాపుబొమ్మ ప్రణీత సుభాష్. తెలుగులో అత్తారింటికి దారేది, రభస, బావ వంటి చిత్రాల్లో నటించింది. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, దర్శన్, కార్తి వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అప్పట్లో ఆమెకు మంచి అభిమానులు ఉన్నారు.

కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. ఆమెకు పాప, బాబు ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ప్రణీత.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన గ్లామరస్ ఫోటోస్ తెగ ఆకట్టుకుంటున్నాయి. చాలా కాలం తర్వాత మోడ్రన్, గ్లామర్ ఫోజులతో కవ్విస్తుంది ఈ వయ్యారి. దీంతో ఈ బ్యూటీ త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనుందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ప్రస్తుతం ప్రణీత సుభాష్ షేర్ చేసిన అందమైన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ఆమె లుక్, స్క్రీన్ ప్రెజన్స్, అందం ప్రేక్షకులను ఫిదా చేశాయి. మరోవైపు తన కూతురు, కొడుకుతో కలిసి ప్రణీత పలు ఫోటోషూట్స్ చేసిన సంగతి తెలిసిందే.




