- Telugu News Photo Gallery Cinema photos Can You Guess This Actress, Who Once Famous With Instagram Reels, Now Turned As Heroine, Her Name is Niharika NM
Tollywood: అప్పుడు మహేష్ బాబుతో ఇన్ స్టా రీల్.. కట్ చేస్తే.. హీరోయిన్గా క్రేజ్.. ఈ బ్యూటీ గురించి తెలిస్తే..
సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా పాపులర్ అయిన అమ్మాయిలు.. ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే పలువురు ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా రాణిస్తుండగా.. ఇప్పుడు మరో వయ్యారి సిల్వర్ స్క్రిన్ కు పరిచయం కాబోతుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ప్రస్తుతం ఈబ్యూటీ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.
Updated on: Oct 15, 2025 | 6:39 PM

ఒకప్పుడు ఆమె సోషల్ మీడియా సెన్సేషన్. రీల్స్, సినిమా ప్రమోషన్స్ ద్వారా పాపులర్ అయ్యింది. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ కు పరిచయం కాబోతుంది. నెట్టింట వచ్చిన క్రేజ్ తో ఇప్పుడు సినిమా ఆఫర్స్ అందుకుంటున్న వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ ఎవరో తెలుసా.. ?

ఆమె పేరు నిహారిక ఎన్.ఎమ్. గతంలో యష్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో సినిమా ప్రమోషన్స్ చేసింది. అప్పటిలో ఈ భామతో సినిమా విడుదలకు ముందు స్టార్స్ రీల్స్ చేస్తుండేవారు. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా మారిన సంగతి తెలిసిందే.

తెలుగు, తమిళం భాషలలో వరసగా అవకాశాలు అందుకుంటూ సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఆమె నటించిన మిత్రమండలి సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రాబోతుంది. ఇందులో ప్రియదర్శి, ప్రసాద్ బెహరా కీలకపాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది.

గతంలో ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తనకు మహేష్ బాబు అంటే ఎంత ఇష్టమో చెప్పుకొచ్చింది. మహేష్ బాబు తన క్రష్ అని.. మహేష్ లాంటి వ్యక్తిని ఇప్పటివరకు చూడలేదని చెప్పుకొచ్చింది. తనకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడే మహేష్ బాబును స్క్రీన్ పై చూశానని చెప్పుకొచ్చింది.

మురారి సినిమాలో మహేష్ బాబును మొదటి సారి చూశానని.. అప్పుడు తనకు ఐదేళ్ల వయసు ఉంటుందని చెప్పుకొచ్చింది. అసలు ఆ ఫీలింగ్ ఏంటో కూడా తెలియదని.. కానీ ఇప్పటికీ మహేష్ బాబే తన క్రష్ అని చెప్పుకొచ్చింది నిహారిక. ఇప్పుడు మిత్రమండలి ప్రమోషన్లలో పాల్గొంటుంది.




