తెలుగు అందం అంతా ఈ బ్యూటీలోనే ఉందేమో.. పరికిణిలో శ్రీముఖి!
అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే, ప్రస్తుతం వరసగా షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది ఈ అమ్మడు. ఇక ఏ కాస్త సమయం దొరికినా చాలు ఈబ్యూటీ తన అందంతో అందరీనీ మాయ చేస్తుంటుంది. తాజాగా రాములమ్మ పరికిణిలో తన అందాలు ఆరబోస్తూ అందరీన ఆకట్టుకుంటుంది. గ్రీన్ కలర్ లంగావోణీలో బ్యూటి ఫుల్ లుక్‌లో ఉన్న క్రేజీ ఫొటోస్ ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Updated on: Oct 15, 2025 | 6:25 PM

అందాల తార శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. పటాస్ కామెడీ షోతో తెలుగు అభిమానులకు పరిచయమైన ఈ అమ్మడు, ప్రస్తుతం టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఓ వైపు పలు షోలకు యాంకర్‌గా చేయడమే కాకుండా, వెండితెరపై సినిమా ఈవెంట్స్‌కు హోస్టుగా చేస్తూ తన సత్తా చాటుతుంది.

పటాస్ కామెడీషోతో బుల్లితెరకు పరిచియమై తన వాక్ చాతుర్యం, అందంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. తర్వాత పలు షోలలో యాంకర్‌గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా బిగ్ బాస్‌కు వెళ్లిన తర్వాత ఈ అమ్మడు గ్రాఫ్ మరింత పెరిగింది. బిగ్ బాస్‌లో తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుని, రన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం టాప్ యాంకర్లలో కొనసాగుతూ, నటిగా కూడా తన నటనతో అందరినీ మాయ చేస్తుంది. చాలా సినిమాల్లో కీలకపాత్రలో చేసి తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఇక ఈ మధ్య బిగ్ బాస్ అగ్నీపరీక్షలో హోస్టుగా చేసి, తన యాంకరింగ్‌తో అందరినీ ఆకట్టుకుంది.

శ్రీముఖి ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ బిజీగా ఉంటుంది. ఏ కాస్త సమయం దొరికినా, తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈబ్యూటీ తన ఇన్ స్టాలో క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది.

అచ్చం తెలుగు అమ్మాయిలా రెడీ అయ్యి, పట్టు పరికిణిలో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.



