- Telugu News Photo Gallery Paderu 103 Year Old Youth: Jarsingi Balam Naidu Longevity Secrets and Active Life
వందేళ్ల యువకుడు.. మూడు తరాల కుటుంబంతో ముచ్చటగా..!
జీవితంలో శతాబ్ది జన్మదినం అంటే ఒక మైలురాయి. అది కొద్ది మందికి మాత్రమే ఆ అవకాశం అదృష్టం ఉంటుంది. వారిలో ఒకరు పాడేరు ఏజెన్సీలోని గుంజివాడ గ్రామానికి చెందిన జర్సింగి బాలం నాయుడు. వందేళ్లు దాటినా ఆయన నవ యువకుడే..! తన పనిని తానే చేసుకుంటారు.. మూడు తరాల కుటుంబంతో ముచ్చటగా ఉన్నారు. తాజాగా 103 జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
Updated on: Mar 14, 2026 | 1:08 PM

జీవితంలో శతాబ్ది జన్మదినం అంటే ఒక మైలురాయి. అది కొద్ది మందికి మాత్రమే ఆ అవకాశం అదృష్టం ఉంటుంది. వారిలో ఒకరు పాడేరు ఏజెన్సీలోని గుంజివాడ గ్రామానికి చెందిన జర్సింగి బాలం నాయుడు. వందేళ్లు దాటినా ఆయన నవ యువకుడే..! తన పనిని తానే చేసుకుంటారు.. మూడు తరాల కుటుంబంతో ముచ్చటగా ఉన్నారు. తాజాగా 103 జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు మనిషి ఆయుష్షు పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. గతంలో ఈజీగా సెంచరీ వయసు దాటే పరిస్థితి ఉంటే.. ఈ కాలంలో సగటున 50 నుంచి 60 ఏళ్లే మనుషుల జీవితకాలం అయిపోయింది. క్రమశిక్షణ కలిగిన జీవన విధానంతో.. రోగాలు దరి చేరకుండా కలత లేని ఆరోగ్యకరమైన జీవితం సాధ్యం అంటున్నారు పాడేరు ఏజెన్సీకి చెందిన బాలం నాయుడు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

అల్లూరి జిల్లా పెదబాయలు మండలం గుంజివాడ గ్రామానికి చెందిన జర్సింగి బాలమనాయుడు.. తన 103వ జన్మదిన వేడుకలు గ్రాండ్ గా జరుపుకున్నారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. 1923 మార్చి 10న జన్మించిన ఈయన.. 1962 నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 1962 నుండి సర్పంచిగా ఉన్నారు. 1987 లో ఎంపీపీగా పోటీ చేశారు. ఆ తర్వాత 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. నడవడానికి వీలులేని తమ గ్రామానికి రహదారి కోసం అనేక పోరాటాలు చేశారు.

జర్సింగి బాలమనాయుడు కు ముగ్గురు భార్యలు.. 12 మంది సంతానం. వారిలో ఆరుగురు ఆడపిల్లలు.. మరో ఆరుగురు కొడుకులు. ఈయనకు మూడు తరాల కుటుంబం ఉంది. 80 మంది వరకు కొడుకులు కూతుర్లు ఉన్నారు. మనవళ్లు మనవరాళ్లూ హైదరాబాద్ బెంగళూరులో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.

జర్సింగి బాలమనాయుడుకు శతాధిక జన్మదినోత్సవ వేడుకలు ఇటీవల గుంజి వాడలో గ్రాండ్ గా నిర్వహించారు. కుటుంబ సభ్యులు గ్రామస్తులు కలిసి.. వేడుకగా చేశారు. ఈనాటి స్కూలు పిల్లలకు శతాధిక యువకుడుగా ఉన్న బాలమనాడును పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక శతాబ్దపు జ్ఞాపకాలను, అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. 103 ఏళ్ల వయసులోనూ ఎప్పటికీ తన పనులు తానే చేసుకుంటారు. కలత లేని, క్రమశిక్షణ కలిగిన జీవితంతోనే ఆయురారోగ్యాలు సాధ్యమని ఆయన చెబుతున్నాడు.
