AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

C/o Kancharapalem సినిమాకు ఎంత బడ్జెట్‌లో తీస్తే ఎంత కలెక్షన్ వచ్చిందంటే..?

C/O కంచరపాలెం సినిమా బడ్జెట్ అంచనాలకు భిన్నంగా జరిగిందని డైరెక్టర్ మహా వివరించారు. కారవాన్లు, జనరేటర్లు వాడకపోయినా, నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ చెల్లింపులు, సింక్ సౌండ్, సంగీతం, రవాణా, భోజనం, వసతి వంటి అంశాలకు బాగా ఖర్చయ్యిందని తెలిపారు. 62 పని దినాలతో రూపొందిన ఈ చిత్రానికి కనిపించని ఖర్చులు ఎక్కువేనని స్పష్టం చేశారు.

C/o Kancharapalem సినిమాకు ఎంత బడ్జెట్‌లో తీస్తే ఎంత కలెక్షన్ వచ్చిందంటే..?
Care Of Kancharapalem
Ram Naramaneni
|

Updated on: Mar 14, 2026 | 1:21 PM

Share

“C/O కంచరపాలెం” సినిమా బడ్జెట్‌పై దర్శకుడు వెంకటేష్ మహా కీలక విరాలు వెల్లడించారు. సినిమాను తక్కువ బడ్జెట్‌లో రూపొందించారనే సాధారణ అభిప్రాయానికి భిన్నంగా వాస్తవ ఖర్చులను ఆయన వివరించారు. చాలా మంది “C/O కంచరపాలెం” చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కించారని భావిస్తారు, ఎందుకంటే చిత్రంలో క్యారవాన్లు, జనరేటర్లు వంటివి వాడలేదు, అలాగే ప్రముఖ నటులు లేరు, మేకప్ లేకుండా సహజమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిగింది. అయితే, ఈ అభిప్రాయం కేవలం బయట కనిపించే వాటి ఆధారంగానే ఉందని మహా స్పష్టం చేశారు. చిత్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరికీ చెల్లింపులు చేయడం ఒక ముఖ్యమైన సూత్రమని ఆయన తెలిపారు. అసిస్టెంట్ డైరెక్టర్లకు నెలకు రూ.5,000 నుంచి రూ.7,000 వరకు గౌరవ వేతనం ఇచ్చామని, ఎవరినీ ఉచితంగా పని చేయించుకోలేదని పేర్కొన్నారు. సినిమా చిత్రీకరణ సమయంలో లాజిస్టిక్స్‌కు భారీగానే ఖర్చయ్యిందని వెంకటేష్ మహా వివరించారు. ప్రతిరోజూ దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేదని, క్రూ సభ్యులు, నటులు, అప్పుడప్పుడు వందల మంది జనం పాల్గొనే సన్నివేశాల కోసం భోజన సదుపాయాలు ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరికీ రూ.100 నుండి రూ.200 వరకు ఇచ్చామని తెలిపారు. సాంకేతిక నిపుణుల కోసం వైజాగ్‌లో హోటళ్లకు బదులుగా ఒక పెద్ద త్రిబుల్ బెడ్‌రూమ్ ఇంటిని అద్దెకు తీసుకున్నామని, దీనికి నెలకు అద్దె చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

సాంకేతికంగా కూడా ఈ చిత్రానికి బాగా పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా సింక్ సౌండ్ అనేది అత్యంత ఖరీదైన టెక్నాలజీ అని మహా చెప్పారు. కేవలం సింక్ సౌండ్ కోసమే రూ.7.5 లక్షలు ఖర్చు చేశామని, ఇది నాగార్జున అనే సౌండ్ డిజైనర్ ద్వారా జరిగిందని వివరించారు. ఇందులో పరికరాల ఖర్చు, డిజైనింగ్ ఖర్చులు అన్నీ కలిపి ఉంటాయని పేర్కొన్నారు. సంగీతానికి సంబంధించి, ఒక చిన్న సినిమాకి అంత నాణ్యమైన సౌండ్, మిక్సింగ్ అసాధారణమని, దీనికి కూడా బాగా ఖర్చు పెట్టామని తెలిపారు. “C/O కంచరపాలెం” చిత్రీకరణ మొత్తం 62 పని దినాల్లో పూర్తయ్యింది. రోజుకు రూ.30,000 నుంచి రూ.50,000 చొప్పున బడ్జెట్‌ను అంచనా వేసినా, 50 రోజులకు రూ.15 లక్షల నుండి రూ.20 లక్షల వరకు ఖర్చు అక్కడే కనిపిస్తుందని మహా ఉదాహరించారు. సినిమాకు సహజమైన వాతావరణం, కొత్త నటీనటులు ఉన్నంత మాత్రాన ఖర్చు కాలేదని అనుకోవడం సరికాదని, “తడిసిపోవాల్సింది తడిసిపోయింది మాకు” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రేక్షకులు గొప్ప సినిమా చూసిన అనుభూతి పొందినప్పుడు, ఆ అనుభూతి వెనుక జరిగిన ఖర్చు చాలా ముఖ్యమని మహా స్పష్టం చేశారు.

టోటల్‌గా ఈ సినిమాకు 70 లక్షల వరకు బడ్జెట్ అయిందని.. థియేటర్లలో దాదాపు రూ.7 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది. అయితే పూర్తిగా చిత్రం పూర్తిగా కంప్లీట్ అయ్యాక ఈ సినిమా నచ్చి.. సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేసింది.

Also Read: ఫర్టిలైజర్స్ ఏం వాడకుండా సంవత్సరమంతా తోటకూరను ఇలా పెంచొచ్చు..

Follow Us
మీ ఊర్లో వానలు పడుతున్నాయా? ఈ పండ్లు తినండి.. అనారోగ్యాలు రావండి
మీ ఊర్లో వానలు పడుతున్నాయా? ఈ పండ్లు తినండి.. అనారోగ్యాలు రావండి
బస్టాండ్‌ నుండి బయల్దేరిన కాసేపటికే బస్సులో మంటలు
బస్టాండ్‌ నుండి బయల్దేరిన కాసేపటికే బస్సులో మంటలు
ఈ ఒక్క జ్యూస్‌తో ఫిట్‌నెస్, ఆరోగ్యం రెండూ మీ సొంతం.. సూపర్ టానిక్
ఈ ఒక్క జ్యూస్‌తో ఫిట్‌నెస్, ఆరోగ్యం రెండూ మీ సొంతం.. సూపర్ టానిక్
ప్రియుడితో బ్రేకప్.. బిగ్‌బాస్ తెలుగు 10లోకి జబర్దస్త్ బ్యూటీ!
ప్రియుడితో బ్రేకప్.. బిగ్‌బాస్ తెలుగు 10లోకి జబర్దస్త్ బ్యూటీ!
ఆ హీరో సినిమా వల్లే నాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది..
ఆ హీరో సినిమా వల్లే నాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది..
నెల్లూరు సెంట్రల్ జైల్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
నెల్లూరు సెంట్రల్ జైల్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
వర్షాకాలం అంతా మల్లెపూలు బాగా పూయాలంటే ఈ 3 కలిపి ఇవ్వండి..
వర్షాకాలం అంతా మల్లెపూలు బాగా పూయాలంటే ఈ 3 కలిపి ఇవ్వండి..
సచిన్ తర్వాత హిస్టరీ క్రియేట్ చేసిన రూట్
సచిన్ తర్వాత హిస్టరీ క్రియేట్ చేసిన రూట్
మాయ మామిడి పండు రహస్యం.. స్వార్థం కాదు సేవే శాశ్వతమని చెప్పే కథ
మాయ మామిడి పండు రహస్యం.. స్వార్థం కాదు సేవే శాశ్వతమని చెప్పే కథ
యశ్ 'టాక్సిక్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. అధికారిక ప్రకటన
యశ్ 'టాక్సిక్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. అధికారిక ప్రకటన