ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగులో క్రేజీ ఫాలోయింగ్..

Rajitha Chanti

Pic credit - Instagram

20 March 2026

పైన కనిపిస్తున్న టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? తాజాగా ఈ అమ్మడు ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఇంతకీ ఆమె  ఎవరంటే.. ఒకప్పుడు ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ నైరా బెనర్జీ. ఇంతకీ ఇప్పుడు ఆ ముద్దుగుమ్మ మీకు గుర్తొచ్చిందా.. ?

దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఆ ఒక్కడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయిన మెప్పించింది.

మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించింది.

ఆ తర్వాత చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉండిపోయింది. దాదాపు 5 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ ఏడాది ఒక హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఆ సినిమా నిరాశ పరిచినప్పటికీ ఈ బ్యూటీ కొత్త సినిమా ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. ఇప్పటికే ఆమె ముందుకు రెండు సినిమా అవకాశాలు వెళ్లాయని టాక్.

మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో మెంటలెక్కిస్తుంది ఈ వయ్యారి. ఈ మధ్య వరుసగా ఫోటోషూట్స్ నెట్టింట షేర్ చేస్తూ కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. 

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటోలు వైరలవుతున్నాయి. ఇందులో ఆమె చాలా కూల్ గా, అందంగా కనిపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.