AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: భార్యతో బలవంతపు శృంగారం.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన వెబ్ సిరీస్.. తెలుగుతో సహా 12 భాషల్లోనూ..

గృహ హింస, మారిటల్ రేప్ వంటి సున్నితమైన అంశాలను స్పృశిస్తూ ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. శుక్రవారం (మార్చి 20) అర్ధరాత్రి నుంచే ఈ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో సహా మొత్తం 12 భాషల్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

OTT Movie: భార్యతో బలవంతపు శృంగారం.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన వెబ్ సిరీస్.. తెలుగుతో సహా 12 భాషల్లోనూ..
OTT Movie
Basha Shek
|

Updated on: Mar 20, 2026 | 8:23 PM

Share

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (మార్చి 20) సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళం, మలయాళం తదితర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అయితే ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ కూడా ఉంది. మారిటల్ రేప్ అనే సున్నితమైన అంశాన్ని డిస్కస్ చేస్తూ ఈ సిరీస్ ను తెరకెక్కించారు. పెళ్లి అయినప్పటికీ భార్య అంగీకారం లేకుండా భర్త బలవంతపు శృంగారంలో పాల్గొంటే అది రేప్ కిందకే వస్తుందనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడీ పాయింట్ ఆధారంగానే ఈ వెబ్ సిరీస్ ను ఓటీటీలోకి తీసుకొచ్చారు. అలాగనీ ఇది డాక్యుమెంటరీ లా ఉండదు. చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఇందులో కమ్లేష్ ఓ ఇంటి పెద్ద కోడలు. ఆమెకు తన మరిది (భర్త తమ్ముడు) అరుణ్ అంటే మంచి అభిప్రాయం ఉంటుంది. అతను ఏ తప్పూ చేయడని గట్టిగా నమ్ముతుంది. దీంతో అరుణ్ కు పూజ అనే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. అయితే పెళ్లి తర్వాత అరుణ్ లోని రాక్షసుడు బయటకు వస్తాడు. పూజకు ఇష్టం లేకపోయినా బలవంతంగా అనుభవిస్తుంటాడు. అంతేకాదు భార్యను ఓ సైకోలా హింసిస్తుంటాడు. ఈ విషయంలో పూజ తల్లితో సహా ఎవరూ ఆమెకు హెల్ప్ చేయరు. సరి కదా.. భర్తతో సర్దుకుపోవాలని సలహా ఇస్తారు.

ఈ క్రమంలో అరుణ్ తో శృంగారం తప్పించుకోవడానికి పీరియడ్స్ వచ్చాయని చెప్పేందుకు తన ప్రైవేట్ పార్ట్స్ దగ్గర గాయం కూడా చేసుకుంటుంది పూజ. మరి కమ్లేష్ కు అరుణ్ గురించి తెలిసిందా? భర్త బారి నుంచి పూజ ఎలా బయటపడింది? అన్నది తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

గృహ హింస, మారిటల్ రేప్ వంటి సున్నితమైన అంశాలను స్పృశిస్తూ తెరకెక్కిన ఈవ వెబ్ సిరీస్ పేరు చిరాయ. ఈ శశాంత్ షా తెరకెక్కించిన ఈ సిరీస్ శుక్రవారం నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, హర్యాన్వి, రాజస్థానీ, భోజ్ పురి, ఒరియా భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుండడం విశేషం. తెలుగు ఆడియన్స్ కూడా ఈ సిరీస్ ను మన భాషలో చూడొచ్చు.

తెలుగులోనూ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!
గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!
పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!
పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!
ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !
ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !
బెర్త్‌పైనే బిర్యానీ బ్యాచ్.. చికెన్ విందుతో మహిళ హల్‌చల్..
బెర్త్‌పైనే బిర్యానీ బ్యాచ్.. చికెన్ విందుతో మహిళ హల్‌చల్..
7 ఫోర్లు, 3 సిక్స్‌లు.. హాఫ్ సెంచరీతో లేడీ సెహ్వాగ్ బీభత్సం
7 ఫోర్లు, 3 సిక్స్‌లు.. హాఫ్ సెంచరీతో లేడీ సెహ్వాగ్ బీభత్సం
హీరో కార్తీతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇంతలా మారిపోయిందా?
హీరో కార్తీతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇంతలా మారిపోయిందా?
కేవలం రూ.88కే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్..200Mbps ఇంటర్నెట్‌..26 OTTలు
కేవలం రూ.88కే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్..200Mbps ఇంటర్నెట్‌..26 OTTలు
టిఫిన్స్‌లోకి అదిరిపోయేలా పల్లీల చట్నీ.. సింపుల్‌గా ఎలా చేయాలంటే?
టిఫిన్స్‌లోకి అదిరిపోయేలా పల్లీల చట్నీ.. సింపుల్‌గా ఎలా చేయాలంటే?
వాల్ నట్స్ కొంటున్నారా?పెంకు పగలకుండానే నాణ్యమైనవి గుర్తించండిలా?
వాల్ నట్స్ కొంటున్నారా?పెంకు పగలకుండానే నాణ్యమైనవి గుర్తించండిలా?
ఉల్లిపాయ, పచ్చిమిర్చితో 2 నిమిషాల్లో పచ్చి ఉల్లి పచ్చడి
ఉల్లిపాయ, పచ్చిమిర్చితో 2 నిమిషాల్లో పచ్చి ఉల్లి పచ్చడి