AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ బాబును అన్నా అని పిలిచిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా? సూపర్ స్టార్ సైతం అవాక్కయ్యాడట..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమా కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించాడు. ప్రీతిజింటా, అమృతా రావు, బిపాసాబసు, కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం సూపర్ స్టార్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

Mahesh Babu: మహేష్ బాబును అన్నా అని పిలిచిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా? సూపర్ స్టార్ సైతం అవాక్కయ్యాడట..
Mahesh Babu
Basha Shek
|

Updated on: Mar 19, 2026 | 10:27 AM

Share

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే ది మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరంటే చాలా మంది మహేష్ బాబు పేరే చెబుతారు. 50 ఏళ్లకు చేరువవుతున్నా ఇప్పటికీ 20 ఏళ్ల కుర్రాడిగానే కనిపిస్తుంటాడు మహేష్. అందుకే అతనితో కలిసి నటించాలని బాలీవుడ్ హీరోయిన్లు సైతం ఎదురు చూస్తుంటారు. 1999లో రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ తన 27 ఏళ్ల సినిమా కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించాడు. టాప్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేశాడు. ప్రీతిజింటా, సిమ్రాన్, సాక్షి శివానంద్, సోనాలీ బింద్రే, భూమిక, రక్షిత, త్రిష, ఇలియానా, అనుష్క, కాజల్ అగర్వాల్, శ్రియ, సమంత, ప్రణీత, తమన్నా, శ్రుతి హాసన్, రష్మిక, శ్రీలీల, పూజా హెగ్డే ఇలా ఎందరో స్టార్ హీరోయిన్స్ మహేష్ బాబుతో కలిసి నటించారు. ప్రీతిజింటా, బిపాసా బసు, సోనాలిబింద్రే, అమృతా రావు, కియారా అద్వానీ లేటెస్ట్ గా ప్రియాంక చోప్రా వంటి బాలీవుడ్ హీరోయిన్స్ సైతం మహేష్ తో రొమాన్స్ చేశారు. ఇక ఈ సూపర్ స్టార్ కు నమ్రతాతో వివాహమైనప్పుడు చాలా మంది అమ్మాయిలు ఫీలైపోయారు. ఇలా ఓ రేంజ్ లో లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మహేష్ ను ఒక హీరోయిన్ అన్నా అని పిలిచిందట. ఆమె పిలుపునకు స్టార్ హీరో సైతం అవాక్కయ్యాడట. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా?

2002లో మహేష్ నటించిన సినిమా బాబీ. దివంగత దర్శకుడు శోభన్ తెరకెక్కించిన ఈ సినిమాలో దివంగత హీరోయిన్ ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ లో మహేష్ బాబు ను మొదటసారి చూసినప్పుడే అన్న అని పిలిచిందట ఆర్తి అగర్వాల్.దీంతో మహేష్ బాబు సైతం అవాక్కయ్యాడట. కారణం ఏంటి అంటే ఆర్తీ అగర్వాల్ వాళ్ల కజిన్ బ్రదర్ సైతం మహేష్ లానే ఉంటాడట. తన అన్నయ్య పోలికలతో ఉన్న మహేష్ ను చూడగానే ఆమెకు అలాంటి ఫీల్ కలిగిందని, అందుకే అలా పిలిచానని ఆర్తీ చిత్ర బృందంతో చెప్పుకొచ్చిందట. ఇక మహేష్ కూడా ఆర్తీ అగర్వాల్ ను కలిసి నీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలువు అని చెప్పారట. మొత్తానికి అమ్మాయిల కలల రాకుమారుడైన మహేష్ ను అన్నా పిలిచిన ఏకైక హీరోయిన్ ఆర్తి అగర్వాలే అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి
Aarthi Agarwal

Aarthi Agarwal

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో
కుమారుడి ఫస్ట్ బర్త్‌ డే.. వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్
కుమారుడి ఫస్ట్ బర్త్‌ డే.. వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్
షెఫాలీ తుఫాన్ ఇన్నింగ్స్.. బంగ్లా ముందు 150 టార్గెట్..!
షెఫాలీ తుఫాన్ ఇన్నింగ్స్.. బంగ్లా ముందు 150 టార్గెట్..!
చెత్త కుప్పలో నుంచి పసిబిడ్డ ఏడుపులు... ఏంటా అని వెళ్ళి చూడగా...
చెత్త కుప్పలో నుంచి పసిబిడ్డ ఏడుపులు... ఏంటా అని వెళ్ళి చూడగా...
గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!
గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!
పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!
పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!
ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !
ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !