AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: మ‌హేష్ వైపు సీరియస్ లుక్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌లో ఏం జరిగిందో చెప్పేసిన శ్రీలీల‌

ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా హీరోయిన్ శ్రీ లీల, నటుడు మహేష్ అచంటకు సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. తాజాగా ఈ వైరల్ వీడియోపై శ్రీలీల కూడా స్పందించింది.

Sreeleela: మ‌హేష్ వైపు సీరియస్ లుక్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈవెంట్‌లో ఏం జరిగిందో చెప్పేసిన శ్రీలీల‌
Sreeleela
Basha Shek
|

Updated on: Mar 18, 2026 | 9:32 PM

Share

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఉగాది కానుకగా రేపు (మార్చి 19) ప్రేక్షకుల ముందుకు రానుంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్- హరీశ్ శంకర్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో ఉస్తాద్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ కూడా అభిమానులను బాగా మెప్పించాయి. ఇక పవన్, శ్రీలీల, రాశీఖన్నా, డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా సినిమా ప్రమోషన్లలో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఉస్తాద్ ప్రమోషన్లలో శ్రీలీలకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా శ్రీ లీల నటుడు మహేష్ అచంటకు సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో శ్రీలీల మహేష్ వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. దీంతో ఈ వైరల్ వీడియో పై మహేష్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. శ్రీ లీల ఫోన్ తన దగ్గర ఉండిపోయిందని ఆమె వెనక్కి తిరిగి చూసినప్పుడు ఫోన్ గురించి అడుగుతున్నారానుకున్నా అంతలోపే ఆమె వెనుక ఉన్న స్క్రీన్ వైపు చూసింది. అంతకుమించి ఇక్కడ ఏమి జరగలేదని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడిదే వీడియోపై శ్రీలీల కూడా క్లారిటీ ఇచ్చింది.

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇస్తున్న సమయంలో అందరం ఆ స్పీచ్ వింటున్నాము. అయితే వెనకనుంచి ఏదో సౌండ్ వస్తున్నట్లు అనిపిస్తే వెనక్కి తిరిగి చూసాను. అయితే నా ఫోన్ మహేష్ దగ్గర ఉండటంతో ఫోన్ కోసమే తిరగానని ఆయన, ఏదో శబ్దం వస్తుందని నేను వెనక్కి తిరిగి చూసాం. అంతే తప్ప అక్కడ ఏమీ జరగలేదు. కొన్నిసార్లు ఇలాంటి సంఘటనలు జరగడం సర్వసాధారణం. కానీ దీని పట్ల సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు కాస్త బాధ కలిగించాయి’ అని శ్రీలీల చెప్పుకొచ్చింది. మరి వైరల్ వీడియోపై స్వయంగా శ్రీలీల క్లారిటీ ఇవ్వడంతో ఇప్పటికైనా దీనిపై చర్చ ఆగుతుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రాత్రి పడుకునే ముందు యాపిల్‌ తింటున్నారా..? ఇది తెలుసుకోండి!
రాత్రి పడుకునే ముందు యాపిల్‌ తింటున్నారా..? ఇది తెలుసుకోండి!
'డీసీ'కి100 కోట్లు.. లోకేశ్ కనగరాజ్, అనిరుధ్‌లకు ఖరీదైన గిప్ట్స్
'డీసీ'కి100 కోట్లు.. లోకేశ్ కనగరాజ్, అనిరుధ్‌లకు ఖరీదైన గిప్ట్స్
పాతాళంలో వ్యవసాయం..ఎండా వానతో పనిలేదు..భూగర్భంలో పంటలు పండించే
పాతాళంలో వ్యవసాయం..ఎండా వానతో పనిలేదు..భూగర్భంలో పంటలు పండించే
బెల్లీ ఫ్యాట్ తగ్గడం లేదా? అసలు కారణం ఇదే ఉండొచ్చు!
బెల్లీ ఫ్యాట్ తగ్గడం లేదా? అసలు కారణం ఇదే ఉండొచ్చు!
ఈ 3 ప్రదేశాల నుండి బయటికొచ్చాక వెనక్కి తిరిగి చూడకూడదు!
ఈ 3 ప్రదేశాల నుండి బయటికొచ్చాక వెనక్కి తిరిగి చూడకూడదు!
నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..!
నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..!
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో