AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అన్నా.. ఏంటిలా మారిపోయావ్‌? ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా? ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొందరు సీనియర్ హీరోలు, హీరోయిన్ల ఫొటోలు కనిపిస్తుంటాయి. అందులో కొందరినీ గుర్తు పడతాం.. మరికొందరినీ అంత త్వరగా గుర్తు పట్టలేం. అలా ఒకప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోకు సంబంధించిన ఫొటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Tollywood: అన్నా.. ఏంటిలా మారిపోయావ్‌? ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా? ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్
Tollywood Actor
Basha Shek
|

Updated on: Mar 18, 2026 | 7:44 PM

Share

పై ఫొటోలో కాస్త బొద్దుగా ఉన్న వ్యక్తిని గుర్తు పట్టారా? అతను ఒకప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో. టాప్ ప్రొడ్యూసర్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదటి సినిమానే ఓ యూత్ ఫుల్ లవ్ స్టోరీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. 2004లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కల్ట్ క్లాసికల్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా యూత్ అయితే ఈ సినిమాను ఎగబడి చూశారు. ఈ సినిమా రిలీజై దాదాపు 22 ఏళ్లు కావొచ్చినా ఇప్పటికీ టీవీలో వస్తే ఛానెల్ మార్చకుండా చూసే వారు చాలామంది ఉన్నారు. అలా మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ హీరో ఆ తర్వాత ఆ సక్సెస్ కంటిన్యూ చేయలేకపోయాడు. ఫలితంగా ఫేడ్ వుట్ అయిపోయాడు. ఈ హీరో చివరిగా 2011లో ఓ సినిమాలో నటించాడు. అంటే అతను వెండితెరపై కనిపించక సుమారు 15 ఏళ్లు అవుతోంది. అయితే ఈ హ్యాండ్సమ్ హీరో ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నాడు. అది కూడా తనకు ఎంతగానో క్రేజ్ తెచ్చిపెట్టిన మొదటి సినిమా సీక్వెల్ తో. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలా ఇప్పుడు ఈ క్రేజీ సీక్వెల్ మూవీ సెట్ నుంచే కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. అందులో ఒకప్పుడు ఎంతో స్లిమ్ గా కనిపించిన హీరో ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. బొద్దుగా గుర్తు పట్టలేనట్లుగా తయారయ్యాడు. మరి అతనెవరో గుర్తు పట్టారా?

పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు రవి కృష్ణ.. అదేనండి 7/జీ బృందావన కాలనీ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో. మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా పలు అవార్డులు అందుకున్న ఈ నటుడు ఆ తర్వాత పెద్దగా రాణించలేకపోయాడు.ముద్దుల కొడుకు, కేడీ, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, నిన్న నేడు రేపు తదితర సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ హిట్స్ అందుకోలేకపోయాడు. ఫలితంగా ఫేడవుట్ అయిపోయాడు. చివరగా 2011లో ఓ తమిళ సినిమా చేసిన రవి కృష్ణ.. ప్రస్తుతం 7జీ బృందావన కాలనీ సీక్వెల్ అయిన ‘ 7/జీ రెయిన్ బో కాలనీ 2’ మూవీ చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

ఈ క్రేజీ సీక్వెల్ లో రవి కృష్ణతో పాటు మలయాళ నటి అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సుమన్ శెట్టి ఓ కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నాడు. తొలి పార్ట్ తీసిన సెల్వ రాఘవన్..ఈ క్రేజీ సీక్వెల్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగానే దియా మెర్సి అనే నటి, రవికృష్ణతో దిగిన ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారిపోయాయి. ముఖ్యంగా ఇందులో హీరో రవి కృష్ణ బొద్దుగా కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

రవి కృష్ణ లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముగ్గురు రిజెక్ట్ చేస్తే కానీ.. చరణ్‌ దగ్గరకు రాలేదు
ముగ్గురు రిజెక్ట్ చేస్తే కానీ.. చరణ్‌ దగ్గరకు రాలేదు
అన్నా.. ఏంటిలా మారిపోయావ్‌? ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా?
అన్నా.. ఏంటిలా మారిపోయావ్‌? ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా?
24ఏళ్ల తర్వాత బయటికొచ్చి.. కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ్‌ రెడ్డి
24ఏళ్ల తర్వాత బయటికొచ్చి.. కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ్‌ రెడ్డి
చల్లటి వెదర్ లో స్పైసీ బేబీ కార్న్ 65.. ఇలా చేస్తే యమ్మీ టేస్ట్
చల్లటి వెదర్ లో స్పైసీ బేబీ కార్న్ 65.. ఇలా చేస్తే యమ్మీ టేస్ట్
గుండెపోటుకు 10 రోజుల ముందే శరీరం ఇచ్చే 5 డేంజర్ సిగ్నల్స్!
గుండెపోటుకు 10 రోజుల ముందే శరీరం ఇచ్చే 5 డేంజర్ సిగ్నల్స్!
వాట్సాప్‌లో పెద్ద మార్పు.. అదేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
వాట్సాప్‌లో పెద్ద మార్పు.. అదేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మీన రాశి వారికి ఎలా ఉందంటే
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. మీన రాశి వారికి ఎలా ఉందంటే
కలల వెనుక మెదడు మాయాజాలం.. మర్చిపోవడానికి కారణం ఇదే!
కలల వెనుక మెదడు మాయాజాలం.. మర్చిపోవడానికి కారణం ఇదే!
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. కుంభ రాశి వారికి ఇలా..
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు.. కుంభ రాశి వారికి ఇలా..
ఫైనాన్స్ లక్కీ రాశులు: ఈ గర్ల్స్ దగ్గర ఉండటం అంటే మనీ, లవ్ బోనస్
ఫైనాన్స్ లక్కీ రాశులు: ఈ గర్ల్స్ దగ్గర ఉండటం అంటే మనీ, లవ్ బోనస్