AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: మాట నిలబెట్టుకున్న అల్లు అర్జున్.. మానసిక దివ్యాంగురాలి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేసిన బన్నీ

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గత నెలలో చెప్పినట్లుగానే తండ్రితో పాటు సర్వస్వం కోల్పోయిన ఓ మానసిక దివ్యాంగురాలికి అండగా నిలిచారు. ఆమె ఖాతాలో డబ్బులు జమ చేశారు. దీంతో బన్నీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

Allu Arjun: మాట నిలబెట్టుకున్న అల్లు అర్జున్.. మానసిక దివ్యాంగురాలి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేసిన బన్నీ
Allu Arjun
Basha Shek
|

Updated on: Mar 19, 2026 | 7:52 AM

Share

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన బాణసంచా పేలుళ్ల ఘటనలో భాగంగా దాదాపు 23 మంది ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే పేలుడు ప్రమాదంలో కడింపల్లి దుర్గ దుర్గ అనే మానసిక దివ్యాంగురాలు తన తండ్రిని కోల్పోయింది. అంతకు ముందే ఆమె తల్లి కూడా తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసింది. దీంతో దుర్గ అనాథలా మిగిలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ దుర్గను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. కేవలం ఒకసారి ఆర్థిక సాయం చేసి చేతులు దులుపు కోకుండా జీవితాంతం ఆమెకు ఆర్థిక భరోసా కల్పించేలా నిర్ణయం తీసుకున్నాడు ఐకాన్ స్టార్. ఇందులో భాగంగా ప్రతినెల ఆ మహిళకు 7500 రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని ప్రకటించారు. దీంతో అల్లు అర్జున్ పై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇప్పుడు అల్లు అర్జున్ మాట ఇవ్వడమే కాకుండా ఆ మాట నిలబెట్టుకున్నారు. గత నెలలో చెప్పినట్లుగానే బన్నీ మొదటి నెల కడింపల్లి దుర్గకు 7500 నేరుగా తన బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఇందుకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అల్లు అర్జున్ కు కృతజ్ఞతలు తెలిపారు. దీనిని బన్నీ ఫ్యాన్స్ కూడా నెట్టింట షేర్ చేస్తూ తెగ వైరల్ చేసేస్తున్నారు.

కాగా అల్లు అర్జున్ కేవలం దుర్గకు మాత్రమే కాకుండా ఇటీవల సినీనటి పావలా శ్యామలకు కూడా ఆర్థిక భరోసా కల్పించిన సంగతి తెలిసిందే. ప్రతి నెలా ఆమె బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తానని బన్నీ భరోసా ఇచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇందులోబాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా చేస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ సుమారు రూ. 800 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తోంది. దీంతో పాటు మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లోనూ ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు బన్నీ. త్వరలోనే ఈ రెండు సినిమాల నుంచి అప్డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

మానసిక దివ్యాంగురాలి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో
కుమారుడి ఫస్ట్ బర్త్‌ డే.. వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్
కుమారుడి ఫస్ట్ బర్త్‌ డే.. వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్
షెఫాలీ తుఫాన్ ఇన్నింగ్స్.. బంగ్లా ముందు 150 టార్గెట్..!
షెఫాలీ తుఫాన్ ఇన్నింగ్స్.. బంగ్లా ముందు 150 టార్గెట్..!
చెత్త కుప్పలో నుంచి పసిబిడ్డ ఏడుపులు... ఏంటా అని వెళ్ళి చూడగా...
చెత్త కుప్పలో నుంచి పసిబిడ్డ ఏడుపులు... ఏంటా అని వెళ్ళి చూడగా...
గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!
గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!
పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!
పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!
ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !
ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !