AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka Shetty: ఆ బిజినెస్ మ్యాన్ తో అనుష్క పెళ్లి.. అసలు విషయం చెప్పేసిన స్వీటీ

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి పెళ్లి వార్తలు రావడం ఇదేమీ మొదటి సారి కాదు. వాటిని ఖండించడం స్వీటీకి కొత్తేమీ కాదు. అయితే ఈసారి అనుష్క పెళ్లి రూమర్లపై ఆమె టీమ్ చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ముఖ్యంగా ప్రతిసారీ అనుష్క ఏజ్ గురించి మాట్లాడడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Anushka Shetty: ఆ బిజినెస్ మ్యాన్ తో అనుష్క పెళ్లి.. అసలు విషయం చెప్పేసిన స్వీటీ
Anushka Shetty
Basha Shek
|

Updated on: Mar 19, 2026 | 1:58 PM

Share

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఈ మధ్యన పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఘాటీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. దీని తర్వాతి ప్రాజెక్టు గురించి అనుష్క టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. తన పెళ్లి రూమర్లతో తరచూ వార్తల్లో నిలుస్తోంది స్వీటీ. గతంలో ఎన్నో సార్లు ఆమె పెళ్లి గురించి ప్రచారం జరిగింది. ఆ బిజనెస్ మ్యాన్ తో పెళ్లి, ఆ హీరో తో వివాహం అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. ఇప్పుడు కూడా ఓ బిజినెస్‌మ్యాన్‌ని అనుష్క పెళ్లి చేసుకోనుందని మళ్లీ రూమర్స్ వచ్చాయి. గతంలోనూ ఇలాంటి రూమర్స్ రాగే అనుష్క పెద్దగా స్పందించలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆమె బాగా సీరియస్ అయ్యింది. ఈ మేరకు అనుష్క పెళ్లిపై వస్తోన్న వార్తలను ఖండిస్తూ ఆమె టీమ్ ఒక నోట్ విడుదల చేసింది.

‘ఒకరి జీవితాన్ని రోజువారీ న్యూస్‌గా మార్చేముందు కనీసం అది నిజమా కాదా అని కూడా చూడటం లేదు. ఊహించడం, అంచనా వేయడం, అనధికారిక సమాచారాన్ని పదేపదే ప్రచురించడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఆమె వయసుపై అనవసరమైన శ్రద్ధ చూపడం, ప్రతి పోస్టులో ’44’ అనే నంబర్‌ని ఏదో వివాదాస్పదమైన అంశంలా హైలైట్ చేయడం అన్నింటికంటే నిరాశ కలిగించే విషయం. వయసు అంత పెద్ద సమస్య అయితే.. హీరోల విషయంలో కూడా అంత ఉత్సాహం ఎందుకు కనిపించడం లేదు? మహిళలకే ఎందుకు భిన్నంగా ఉంటుంది. అనుష్క శెట్టి తన కెరీర్‌ని ప్రతిభ, గౌరవంతో నిర్మించుకున్నారు. ఆమె ఎప్పుడూ పీఆర్ స్టంట్స్‌పై ఆధారపడలేదు’.

ఇవి కూడా చదవండి

‘అనుష్క వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా ఉంచుకోవాలనుకుంటుంది. అలాంటి మహిళను ఇలా టార్గెట్ చేయడం అన్యాయం. ప్రతిఒక్కరూ తమ జీవితంలో జరిగే విషయాలనీ అందరికీ చెప్పాలనుకోరు. ఆ నిర్ణయాన్ని అందరమూ గౌరవించాలి. వివాహం వ్యక్తిగత విషయం. ఇది బ్రేకింగ్ న్యూస్ కాదు. ట్రెండ్ కాదు. కేవలం వ్యూస్ కోసం సెన్సేషనలైజ్ చేయాల్సిన విషయం అంతకంటే కాదు. ఇకనైనా బాధ్యతగా వ్యవహరించండి. హద్దులని గౌరవించండి. ప్రచురించే ముందు నిజమేదో? అబద్ధమేదో పూర్తిగా నిర్ధారించుకోండి. హీరోయిన్లని కూడా హీరోలతో సమానంగా గౌరవించండి’ అని అనుష్క టీమ్ స్గ్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో
కుమారుడి ఫస్ట్ బర్త్‌ డే.. వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్
కుమారుడి ఫస్ట్ బర్త్‌ డే.. వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్
షెఫాలీ తుఫాన్ ఇన్నింగ్స్.. బంగ్లా ముందు 150 టార్గెట్..!
షెఫాలీ తుఫాన్ ఇన్నింగ్స్.. బంగ్లా ముందు 150 టార్గెట్..!
చెత్త కుప్పలో నుంచి పసిబిడ్డ ఏడుపులు... ఏంటా అని వెళ్ళి చూడగా...
చెత్త కుప్పలో నుంచి పసిబిడ్డ ఏడుపులు... ఏంటా అని వెళ్ళి చూడగా...
గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!
గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!
పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!
పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!
ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !
ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !