హీరోయిన్ ఛాన్స్ వస్తే వద్దని చెప్పింది.. బుల్లితెరపై గ్లామర్ అరాచకం..
Rajitha Chanti
Pic credit - Instagram
20 March 2026
జబర్దస్త్ వర్ష.. బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు సంపాదించుకుంది ఈ భామ.
అలాగే బుల్లితెరపై సీరియల్స్ సైతం చేసింది. అయితే తనకు సినిమాల్లో హీరోయిన్స్ ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేశానంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.
జబర్దస్త్ డేట్స్, టీవీ షెడ్యూల్స్ ముందే ఖరారు కావడం వల్ల సినిమా డేట్స్ సర్దుబాటు చేయలేక ఎన్నో ఆఫర్స్ వదులుకున్నట్లు అసలు విషయాలు చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం తనకు టీవీలో వస్తున్న గుర్తింపు, సంతోషం డిస్టర్బ్ చేసుకోవడం ఇష్టం లేదని తెలిపింది. కొన్ని రోజుల తర్వాత సినిమాల గురించి ఆలోచిస్తానని అన్నారు.
సంక్రాంతి ఈవెంట్ సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో పనిచేయడం వల్ల అస్వస్థకు గురయ్యానని.. వెంటనే చికిత్స తీసుకున్నట్లు తెలిపింది.
సినిమాల్లో తనకు మెయిన్ లీడ్స్, హీరోయిన్ పాత్రలు చేయడం ఇష్టం లేదని.. ఇంట్లో ఫ్యామిలీలో ఉండే వదిన, అక్క, చెల్లి పాత్రలు ఎక్కువ ఆసక్తి అని అన్నారు.
తనకు అలాంటి క్యారెక్టర్లే సంతోషాన్నిస్తాయని అన్నారు. ఎన్టీఆర్ చెల్లిగా, రామ్ చరణ్ సినిమాలో కీలకపాత్రలో, అల్లు అర్జున్ గర్ల్ ఫ్రెండ్ గా నటించాలని ఉందని తెలిపింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది వర్ష. తాజాగా నీలిరంగు చీరకట్టులో మతిపోగొట్టే ఫోజులతో నెట్టింట మెస్మరైజ్ చేస్తుంది ఈ వయ్యారి.